ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతీని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. దీన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పుణికి పుచ్చుకున్నట్లున్నారు. అమెరికాలో ప్రపంచ దిగ్గజ సంస్థకు సీఈఓ అయినప్పటికీ తన యదలోతుల్లో అణువణువునా మాతృదేశం భారతదేశం పట్ల ప్రేమ పొంగుతుంటుందని ప్రదర్శించడంలో ఏమాత్రం వెనుకాడరు.భారత దేశం తన శరీరంలో అంతర్భాగమని, ప్రపంచలో తాను ఎక్కడికి వెళ్లిన తన వెంట తన దేశం భారతదేశాన్ని తీసుకెళతానని సుందర్ పిచాయ్ చేసిన తాజా వాఖ్యలు వైరల్‌గామారాయి.
గూగుల్ సీఈఓ పదవిని అలంకరించి భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతయంగా ఇనుమడింపజేసిన సుందర్ పిచాయ్‌కు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని భారత రాయబారి నుంచీ సుందర్ పిచాయ్ ఈ పురస్కారాన్ని శుక్రవారం అందుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో పిచాయ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ అవార్డును గూగుల్ సీఈఓకు అందజేశారు.
సందర్భంగా పిచాయ్ మరోమారు తాను పుట్టిన గడ్డ భారతదేశం పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. భారతదేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, దేశ ప్రజలకు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని తెలిపారు. భారతదేశం ఎల్లప్పుడూ తన దేహంలో అతర్భాగమని భావోద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా పిచాయ్ తన తల్లిదండ్రులు, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.