సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా తనకు అనుకూలంగా ఉండే ఐఏఎస్ - ఐ.పి.ఎస్ లను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్నికోరుతుంది. ప్రభుత్వ పాలనలో తమకు సహకరించగల ఐఎఎస్ - ఐపిఎస్ అధికారులను మాత్రమే నియమించుకునేందుకు మొగ్గుచూపుతుంది. కేంద్రంతో పట్టుబట్టి మరీ తమకు కావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వాలు నియమించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీకి వీర విధేయుడైన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని జగన్ ఏరికోరి ఏపీకి తెచ్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఏపీకి త్వరలోనే రాబోతున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలోనే టీటీడీ ఈవోగా సదరు ఐఏఎస్ అధికారి రాకను వైసిపి సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. గతంలో మాజీ సీఎం చంద్రబాబు తో పని చేసిన సదరు ఐఏఎస్ అధికారి చంద్రబాబుకు వీరవిధేయుడని - అందుకే ఆ ఐఏఎస్ అధికారి రాకను వైసీపీలో మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏపీలో పనిచేస్తోన్న ఓ కీలక ఐఏఎస్ అధికారి సిఫారసుతోనే జగన్ టీటీడీ ఈవోగా ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ వత్స కృష్ణ రాబోతున్నారంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 1994 కర్ణాటక బ్యాచ్ కు చెందిన శ్రీవత్స కృష్ణ గతంలో చంద్రబాబు తో కలిసి పనిచేశారు. అంతే కాదు మాజీ సీఎం చంద్రబాబు తో శ్రీ కృష్ణ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ వత్స కృష్ణ చాలాసార్లు చెప్పారు. హైదరాబాద్ కు ఐటీని పరిచయం చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు శ్రీ వత్స కృష్ణ చాలాసార్లు వంతపాడారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో ఈ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టింది కూడా శ్రీ వత్స కృష్ణనే. అంతేకాకుండా చంద్రబాబును ఒక గొప్ప నేతగా రాజకీయ మేధావి గా దేశంలోకెల్లా అత్యంత పాలనా దక్షత కలిగిన రాజనీతిజ్ఞుడిగా శ్రీ వత్స కృష్ణ చాలాసార్లు ప్రశంసించారు. ఇక మరో అడుగు వేసినా శ్రీవత్సవ చంద్రబాబు నాయుడు భారత ప్రధానిగా కూడా అవుతారని దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బాహాటంగానే ప్రకటించారు
ఇక తాజాగా సీఎం జగన్ తో భేటీ అయిన శ్రీ కృష్ణ స్వామి భక్తిని మరోసారి చాటుకున్నారు. జగన్ తో భేటీ అయిన కొద్ది గంటల తర్వాత తన మాజీ బాస్ చంద్రబాబును కలిశారు. అంతేకాదు నా ఎక్స్ బాస్ చంద్రబాబును చాలా రోజుల తర్వాత కలవడం చాలా సంతోషాన్నిచ్చింది... ఇదో గౌరవంగా భావిస్తున్నాను అంటూ బాబుతో కలిసి దిగిన ఫోటోను శ్రీ వత్స కృష్ణ ట్వీట్ చేశారు. ఇదంతా చూసిన వైసీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చిందట. చంద్రబాబు - టిడిపి అభిమాని గా ఉన్న శ్రీ వత్స కృష్ణ .....జగన్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ఎంతవరకు సబబు అని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని శ్రీ వత్స కృష్ణ లీక్ చేయరని గ్యారెంటీ ఏమిటని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వైసీపీ సీనియర్ నేత ప్రశ్నిస్తున్నారు. శ్రీ వత్స కృష్ణ అత్యంత ప్రతిభావంతుడైన ఐఏఎస్ ఆఫీసర్. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రతిపక్ష నేతకు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవో వంటి కీలకమైన పదవిలో నియమించడం వెనక ఆంతర్యం ఏమిటనేది సీఎం జగన్ కి తెలియాలని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు మరి ఈ వ్యవహారం పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.