తెగేదాక లాగితే టీడీపీకే నష్టం

Update: 2022-08-19 04:12 GMT
వైసీపీ హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో వ్యవహారాన్ని తెలుగుదేశంపార్టీ తెగేదాకా లాగాలని చూస్తున్నట్లుంది. ఇదేపని చేస్తే నష్టపోయేది టీడీపీయే అన్న విషయం స్పష్టం. ఇంతకీ విషయం ఏమిటంటే మాధవ్ అసభ్య వీడియో ఒరిజనలే అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఫేకని ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో చెప్పారు. సీఐడీ చీఫ్ చెప్పటాన్ని టీడీపీ అధికారప్రతినిధి పట్టాభి, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుపడుతున్నారు.

అమెరికాలోని ఫోరెన్సిక్ నిపుణులు జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక తప్పని సునీల్ కుమార్ చెప్పటాన్ని పట్టాభి తప్పుపడుతుంటమే ఆశ్చర్యంగా ఉంది. పట్టాభి మరచిపోయిన విషయం ఏమిటంటే ఆ సర్టిఫికేట్ తప్పని సునీల్ చెప్పలేదు. తానిచ్చినట్లుగా టీడీపీ సర్క్యులేషన్లో పెట్టిన సర్టిఫికేట్ ను తానివ్వలేదని స్వయంగా జిమ్ స్టాఫోర్డే సీఐడీకి పంపిన మెయిల్లో స్పష్టంగా చెప్పారు. అంటే జిమ్ ఇచ్చిన సర్టిఫికేట్ ను టీడీపీ ట్యాంపర్ చేసినట్లు జిమ్ ఆరోపించారు.

వీడియో తనదగ్గరకు తీసుకొచ్చిన పోతిన ప్రసాద్ అనే వ్యక్తి వచ్చిన రిజల్టును మార్చి ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా జిమ్ సదరు ఈ మెయిల్లో సీఐడీకి చెప్పారు. అయితే తాను ఆలోచించుకునేలోపే పోతిన ఆ రిజల్టు తీసుకుని వెళ్ళిపోయినట్లు కూడా చెప్పారు.

ఈ మెయిల్లో జిమ్ ఏదైతే చెప్పారో దాన్నే సునీల్ మీడియాతో చెప్పారంతే. జిమ్ కూడా తాను పరిశీలించిన వీడియో ఒరిజనలని ఎక్కడా చెప్పలేదు. అది మార్పింగ్ కాదు, ఎడిట్ చేయలేదని మాత్రమే చెప్పినట్లు స్వయంగా జమ్మే అంగీకరించారు.

పైగా తానిచ్చిన రిపోర్టును మార్చేసి సదరు వీడియో ఒరిజనలే అని తాను సర్టిఫై చేశానని చెప్పటం అబద్ధమన్నారు. జిమ్ ఇచ్చిన మెయిల్లోని అంశాలను సునీల్ చెప్పటాన్నే పట్టాభి తప్పుపడుతున్నారు. ఇప్పటికే తాము సర్క్యులేషన్లోకి తెచ్చిన వీడియో ఒరిజనలే అని దబాయిస్తున్నారు.

ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టకపోతే మాధవ్ అసభ్య వీడియో వ్యవహారం పక్కకుపోయి ఇంకేదో విషయం హైలైటవ్వటం ఖాయం. టీడీపీ కూడా అదే కోరుకుంటే ఎవరు ఏమీ చేయలేరు.
Tags:    

Similar News