మోడీ భేటీ తర్వాత నీరసంగా పవన్.. అసలు కారణం ఇదేనా?

Update: 2022-11-15 04:18 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ అధినేత మీద జరగనంత వ్యక్తిగత దాడులు.. పేరు ప్రఖ్యాతుల మీద విరుచుకుపడుతున్న తీరును చూస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇంత టార్గెటెడ్ గా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అన్న సందేహం కలుగక మానదు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఆయన్ను ఉద్దేశించి విమర్శించటం మొదలు పెడితే.. రెండుచోట్ల పోటీ చేసి.. రెండు చోట్ల ఓడిన ఒక అధినేత మీద అధికారపక్షం ఎందుకు అంత కసిగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.

అంటే.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు పేర్కొంటున్నట్లుగా పవన్ బలహీనుడు కాదు. అత్యంత బలవంతుడు. ఈ కారణంతోనే తమకు మేకుగా మారిన పవన్ ను ఉద్దేశించి నిత్యం ఏదోలాంటి విష ప్రచారం.. తప్పుడు మాటల్ని చర్చకు తీసుకొస్తే.. విషయం పక్కకు వెళ్లి.. పనికిమాలిన విషయాలకు పెద్ద పీట వేయటం ద్వారా.. తాము డిసైడ్ చేసిన స్క్రిప్టే లైవ్ లో ఉంటుందన్న ఆశే.. తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు.

ప్రధానమంత్రి మోడీ ఏపీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడటం.. ఆ తర్వాత ఆయన  మీడియా ముందుకు వచ్చి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయిన నాటి నుంచి పవన్ పై కొత్త తరహా ప్రచారం సాగుతోంది. తనతో భేటీ అయిన వపన్ ను ఉద్దేశించి మోడీ క్లాస్ పీకారని.. ఆయన చేసిన వ్యాఖ్యలతో పవన్ నీరస పడ్డారని.. ఎంతో ఉత్సాహంగా మోడీతో భేటీకి వస్తే.. తన అంచనాలకు భిన్నంగా తనను క్లాస్ పీకటంతో పాటు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇదంతా ఎందుకు? అంటే.. పవన్ జోరుకు బ్రేకులు వేసేందుకేనని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా.. పవన్ ఈ మధ్యన మహా చురుకుగా ఉంటున్నారు. ఆయన చేపట్టే కార్యక్రమాలు ఏపీ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారుతోంది. దీనికి తోడు టీడీపీతో కలిసి పోటీ చేయొచ్చన్న విషయాన్ని గుర్తించి మరీ పవన్ ను మరింత ఎక్కువగా టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు.

జనసేనాని మీద జరుగుతున్న ప్రచారమే నిజమని భావిస్తే.. మోడీ తీసుకున్న క్లాస్ తర్వాత కూడా.. ఉత్సాహంగా ఉత్తరాంద్ర పర్యటన ప్రోగ్రాంకు తెర తీసి ఉంటారా? అన్నది క్వశ్చన్. మోడీ గురించి.. పవన్ గురించి బాగా తెలిసిన వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. మోడీ నిజంగానే పవన్ ను ఉద్దేశించి కాస్తంత ఘాటుగా మాట అని ఉంటే.. మరో ఆలోచన లేకుండా పవన్ కామ్ అయి ఉండేవారని అంటున్నారు.

ఎందుకంటే..షూటింగ్ వేళలో చిన్నపాటి అప్ సెట్ కు కాస్తంత ఎక్కువగా రియాక్టు కావటంతో పాటు.. నచ్చని పని జరిగినప్పుడు పవన్ తీరులో తేడా కొట్టొచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి అలవాటున్న పవన్.. పిలిచి మరీ ప్రధాని మోడీ క్లాస్ పీకితే నార్మల్ గా ఉండటం సాధ్యం కాదని.. అందుకు భిన్నంగా మరింత ఉత్సాహంతో ఉత్తరాంధ్ర లో వరుస పెట్టి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న పవన్ తీరు చూస్తే.. క్లాస్ పీకటం.. ముఖం వాడిపోవటం.. కళ తప్పటం లాంటి మాటలన్ని కూడా తప్పుడు ప్రచారాలే తప్పించి.. అందులో ఇసుమంతైనా నిజం లేదని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News