కొన్ని రోజులుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగానే ఉండి.. పార్టీ ప్రచారం.. ఇతర పార్టీ పగ్గాలు.. నందమూరి వారసుడు.. తారక్‌కు అప్పగిస్తే బెటర్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు.. తర్వాత.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే బాబు పదే పదే అవసరమైతే పార్టీ కోసం తాను వస్తాను.. లోకేష్ వస్తాడు అని చెపుతున్నారే తప్పా తారక్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా.. టీడీపీలో మాత్రం గుసగుస వినిపిస్తూనే ఉంది.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీలో ఓ వర్గం నేతల్లో ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం నేతల్లో చర్చ సాగుతోంది. ``తారక్ కనుక పగ్గాలు చేపడితే.. టీడీపీ పుంజుకుంటుందా? అధికారం లోకి వచ్చేస్తుందా? అయితే.. అప్పుడు మనం ఏం చేయాలి ? `` అనేది వీరి మధ్య చర్చ. ఏ ఇద్దరు ఆ సామాజిక వర్గం నేతలు కలుసుకున్నా.. ఫోన్ చేసుకున్నా.. ఇదే విషయం చర్చకు వస్తోంది. దీంతో తారక్ వస్తే.. టీడీపీ పుంజుకుంటుందా? అనే విషయం.. వైసీపీలో అందరి మధ్యకు చేరింది. ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గంలో ఏదో అలజడి రేగుతోందని.. అధిష్టానం కూడా పసిగట్టినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీలోని ఒకరిద్దరు కీలకస్థానాల్లో ఉన్నవారు.. అదేం లేదు.. తారక్ వచ్చినా.. ఏమీ జరగదు. 2009లోనే ఎన్నో అంచనాలతో బయటకు వచ్చి మామను సీఎం చేసేందుకు ప్రచారం చేసినా ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయారు. ఇప్పుడు ఆయన వచ్చినా.. ప్రభుత్వ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నందున.. వైసీపీ వైపే ప్రజలు ఉంటారని.. సో.. ఎవరూ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ``తారక్ వచ్చినా.. చంద్రబాబు ఉండగా మాత్రం రాడు.`` అని ఓ కీలక నాయకుడు మరింత పరుషంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా తారక్ ఎంట్రీ వైసీపీలో కాస్త చర్చ రేపుతోందని అంటున్నారు పరిశీలకులు.