ఉద్యోగులు పోతాయనుకుంటే.. ట్విస్ట్ ఇచ్చిన లేడీ బాస్..!

Update: 2022-12-14 10:38 GMT
ఇటీవలి కాలంలో దిగ్గజ కంపెనీలైన మేటా.. ట్విట్టర్.. అమెజాన్.. సిస్కో.. హెచ్పీ.. డెల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం పేరుతో వరుసబెట్టి వేలాది మంది ఉద్యోగులను వరుసబెట్టి ఇంటికి పంపుతున్నారు. ఈ విషయంలో అమెరికాలోని బడా కంపెనీలన్నీ ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి సమయంలో ఓ లేడీ బాస్ తన కంపెనీలో ఉద్యోగులకు భారీ బోనంజా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. క్రిస్మస్ కానుక పేరిట పది మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు (రూ.82 లక్షలు) బోనస్ గా ప్రకటించారు. దీంతో తొలుత షాక్ గురైన ఉద్యోగులు ఆ వెంటనే తేరుకుని ఆనందంతో కన్నీటీ పర్యంతమయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన కంపెనీల్లో రాయల్ హిల్ ఒకటి. ఈ కంపెనీని రెయిన్ హార్ట్ అనే మహిళ నిర్వహిస్తుంది. దీంతోపాటు హన్కాక్ ప్రాస్పెక్టింగ్ నే మైనింగ్.. అగ్రికల్చర్ కంపెనీకి రెయిన్ హార్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 34 బిలియన్ డాలర్ల సంపదనతో ఆమె ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.

తన తండ్రి స్థాపించిన హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఉద్యోగులతోపాటు రాయల్ హిట్ కంపెనీ ఉద్యోగులందరితో ఇటీవల ఆమె సమావేశం నిర్వహించారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆర్థిక మాంద్యంతో బడా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడిపోయారు.

ఈ క్రమంలోనే ఆమె తన కంపెనీలోని పది మంది ఉద్యోగుల పేర్లను చదివి వినిపించారు. దీంతో వీరి ఉద్యోగాలు గోవిందా అని అంతా భావించారు. అయితే రెయిన్ హార్ట్ మాత్రం ఈ పది మంది ఉద్యోగులకు క్రిస్మస్ కానుక కింద ఒక్కొక్కరికి లక్ష డాలర్లను ప్రకటించారు. మన కరెన్సీలో అయితే ఒక్కొక్కరికి 82 లక్షలు అన్నమాట.

ఇంత భారీ మొత్తంలో తమకు బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులంతా షాక్ కు గురయ్యారు. ఆ వెంటనే తేరుకుని ఆనందంతో ఉద్వేగానికి గురయ్యారు. ఈరోజు తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో మూడు నెలల క్రితం చేరిన ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం.

కాగా ఈ ఏడాది కాలంలో హన్కాక్ ప్రాస్పెక్టింగ్ మైనింగ్ కంపెనీ 3.3 బిలియన్ల డాలర్ల లాభాన్ని ఆర్జించింది. మిగతా కంపెనీలు సైతం లాభాలు గడించాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన రెయిన్ హార్ట్ పది మంది ఉద్యోగులకు భారీ బొనంజా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీంతో ‘బాస్’ అంటే ఇలా ఉండాలంటూ ఉద్యోగులు ఆ లేడి బాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News