అక్కాచెల్లెళ్లయినా బెడ్ షేర్ చేసుకుంటే జరిమానా

Update: 2017-04-30 10:48 GMT

పాకిస్థాన్ లోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ దుమారం రేపుతోంది. యూనివర్సిటీలోని అమ్మాయిల హాస్టల్ లో ఇద్దరు అమ్మాయిలు... చివరకు వారి అక్కాచెల్లెళ్లయినా సరే బెడ్ షేర్ చేసుకుంటే భారీ జరిమానా తప్పదని ఆర్డర్ వేసింది.  బెడ్ పై కూర్చొన్నా.. ఒకే దుప్పటిలో ఇద్దరు పడుకున్నా జరిమానా తప్పదని హెచ్చరించింది.  యూనివర్శిటీ తీసుకొన్న ఈ నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది.  37 ఏళ్ళ చరిత్ర గల ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
    
హాస్టల్ లో బెడ్ ల మధ్య తగినంత  దూరాన్ని పాటించాలని వర్సిటీ  సూచించింది. ప్రత్యేకంగా అమ్మాయిల హాస్టళ్ళలోనే ఈ విధంగా నిబంధలను అమలు చేయడంపై సోసల్ మీడియాలో తీవ్రమైన చర్చసాగుతోంది. అబ్బాయిల హాస్టళ్ళలో పెద్ద సంఖ్యలో నాన్ బోర్డర్ లు మకాం వేసినా పట్టించుకోకుండా అమ్మాయిల హాస్టళ్ళలోనే ఈ విధంగా ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
    
అయితే, ఈ హాస్టళ్లలో స్థలం సమస్య ఉందని, అంతేకాకుండా అమ్మాయిలు తమ వెంట బంధువులు, కుటుంబసభ్యులను ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని యూనివర్శిటీ చెబుతోంది. అయితే... ఇక్కడ వేరే కారణం కూడా వినిపిస్తోంది. పాకిస్థాన్ లోని యూనివర్సిటీ అమ్మాయిలు పాశ్చాత్య పోకడలు పోతున్నారని... అమ్మాయిల మధ్య అనుచిత సంబంధాలు ఏర్పడుతుండడంతో ఇలాంటి కఠిన నిబంధన పెట్టారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News