కాంగ్రెస్ పార్టీలో మరోమారు కలకలం చెలరేగింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలంటూ ప్రతిపక్షాలు తీసుకొచ్చిన తీర్మానంపై కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. అభిశంసనను కాంగ్రెస్ లోని ఓ వర్గం విభేదిస్తున్నట్లు సమాచారం. సాక్షాత్తూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాటు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం - అభిషేక్ సింఘ్విలు కూడా ఈ తీర్మానంపై సంతకాలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అయితే ఈ చీలికను కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకోవాలని చూస్తోంది.
ప్రవర్తన సరిగా లేదన్న కారణం చూపుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 71 మంది రాజ్యసభ ఎంపీలు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలన్న తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే ఈ తీర్మానం ప్రతిపక్ష పార్టీలనే కాదు కాంగ్రెస్‌ను కూడా చీల్చింది. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని కావడం వల్ల కావాలనే ఆయనను ఈ అంశంలోకి లాగలేదు అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. మరి మిగతావాళ్లు ఎందుకు సంతకాలు చేయలేదు అని ప్రశ్నించగా...కొందరిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు అని అన్నారు. ఈ తీర్మానంపై సంతకం చేయడానికి మన్మోహన్ సింగ్ నిరాకరించారన్న విషయంలో నిజం లేదని సిబల్ స్పష్టంచేశారు. మరో నేత సల్మాన్ ఖుర్షీద్ దీనిపై స్పందిస్తూ.. అభిశంసనపై తనకు మాట్లాడేందుకు అనుమతి లేదని అన్నారు. అయితే అభిశంసన అన్నది మాత్రం చాలా పెద్ద విషయమని ఆయన చెప్పారు. ఇప్పటివరకు భారత చరిత్రలో ఏ న్యాయమూర్తినీ ఇలా అభిశంసన ద్వారా తొలగించలేదు. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను అనుకోలేదని కపిల్ సిబల్ చెప్పారు. పరాష్ట్రపతికి పిటిషన్ సమర్పించిన బృందంతో తనకు సంబంధం లేదన్నారు. అభిశంసనపై తీర్మానం చేసిన విపక్ష పార్టీలతో తాను సమావేశం కాలేదన్నారు. కోర్టు అభిప్రాయాన్ని వ్యతిరేకించినా లేక తీర్పు నచ్చకపోయినా.. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలని నిర్ణయించడం సరికాదని ఆయన అన్నారు.
మరోవైపు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలిగించాలని కోరుతూ విపక్షాలు ఇవాళ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పిటిషన్ అందజేశాయి. ఆ పిటిషన్‌పై ఏడు పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేశారు. అందులో కాంగ్రెస్. సీపీఎం - సీపీఐ - ఎన్సీపీ - ఎస్పీ - బీఎస్పీ పార్టీలు ఉన్నాయి. పిటిషన్‌లో సుమారు 64 సంతకాలు ఉన్నట్లు రాజ్యసభ ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. పిటిషన్ పై సంతకం చేయని పార్టీల్లో తృణమూల్ తో పాటు ద్రావిడ మున్నేట్ర ఖజగం ఉన్నాయి. సీజే అభిశంసనకు అయిదు కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. అభిశంసన తీర్మానానికి రాజ్యసభలో సుమారు 50 మంది ఎంపీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.