పాకిస్థాన్...మన దేశంతో సరిహద్దు పంచుకుంటోన్న దాయాది దేశం...భారత్ పై అక్కసు వెళ్లగక్కేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. భారత్ లో జరిగే రాజకీయ పరిణామాలు....జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న వ్యవహారాలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమైనవిషయం తెలిసిందే. ఆర్టికల్ 371 రద్దు, సీఏఏ వంటి వ్యవహారాల్లో ఇమ్రాన్ చేసిన కామెంట్స్ పై విమర్శలు వచ్చాయి. పాక్ లోని హిందువులు అక్కడ మైనారిటీలుగా ఎలా ఇబ్బందులు పడుతున్నారో తమకు తెలుసని....ముందు వారి బాగోగులు చూసిన తర్వాత భారత్ లోని మైనారిటీలపై ప్రేమ చూపించొచ్చని నెటిజన్లు ఇమ్రాన్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్....పాక్ లోని హిందువులకు ట్విట్టర్ లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ శుభాకాంక్షలపై పాక్ లోని అతివాదులు మండిపడుతున్నారు. పాక్ ప్రధాని అయి హిందువులకు శుభాకాంక్షలు తెలపడం ఏమిటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి ఇది తగదంటూ విమర్శించారు. పాక్ లోని ముస్లింలు, హిందువులు సమానమేనని,ప్రధాని శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేమీ లేదని మరికొందరు ఇమ్రాన్ కు మద్దతుపలికారు.
పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదుల శిబిరాలున్నాయని, ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో పాక్ కూడా సహకరించాలని భారత్, అమెరికాలు చాలాసార్లు హెచ్చరించాయి. అయితే, తమ దగ్గర ఉగ్రవాదులు లేరంటూ పాక్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం పాక్ సరిహద్దులోని బాలాకోట్ లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో, పాక్ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయింది. ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతు తెలిపాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉగ్రవాదంపై పోరులో భారత్ వెంట నడుస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే అందరినీ కలుపుకుపోవాలని....అన్ని దేశాలతో సఖ్యతగా ఉండాలని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు కనువిప్పు కలిగిందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా కొన్ని రోజులుగా జరగుతున్న పరిణామాలతో పాక్ కు జ్నానో దయం అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. అందరినీ కలుపుకుని పోతేనే పాక్ కు భవిష్యత్తు ఉంటుందని పాక్ కు అర్థమై ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని హిందువులకు శుభాకాంక్షలు చెప్పే కొత్త సంప్రదాయానికి తెరతీశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత్ లోని మైనారిటీ ముస్లింలు వ్యతిరేకిస్తోన్న సీఏఏను ఇమ్రాన్ వ్యతిరేకించారని, దీంతో, ముందు తమ దేశంలోని హిందువుల గురించి కూడా ఆలోచించాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.