మోదీని కాద‌ని మ‌న్మోహ‌న్‌ కు ఇమ్రాన్ ఆహ్వానం

Update: 2019-09-30 14:59 GMT
భార‌త ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌ సింగ్‌ పై పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ ఖాన్ త‌న విద్వేషాన్ని అనేక రూపాల్లో వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకిస్తాన్ తీరుపై ఎన్నో దేశాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా పాక్‌ తో పాటు ఆ దేశ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ సైతం విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రిత‌మే యూఎన్‌ వోలో భార‌త్‌ ను తీవ్రంగా విమ‌ర్శించిన ఇమ్రాన్ ఇప్పుడు మ‌ళ్లీ మోడీని క‌వ్వించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. స్వాతంత్య్రానంత‌రం పాక్‌ లో విలీనం అయిన కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను తిరిగి ప్రారంభించాల‌ని పాక్ కొద్ది రోజుల క్రితం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

కర్తార్‌ పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించేందుకు రోజుకు 500 మంది భార‌తీయుల‌కు మాత్రమే అనుమతి ఇస్తారు. భక్తులకు వీసా అవసరం లేదు. అయితే భక్తులు భారతదేశ పాస్‌ పోర్టును తప్పనిసరిగా తమ వెంట తీసుకువెళ్లేలా పాక్ ప్ర‌భుత్వం గ‌తంలోనే నిబంధ‌న‌లు రూపొందించింది. ఈ కారిడార్‌ ను తిరిగి ప్రారంభించేందుకు భార‌త ప్రధాని నరేంద్ర మోదీని విస్మరించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను ఆహ్వానించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని బ‌ట్టి ఇమ్రాన్ మ‌రోసారి భార‌త్ విష‌యంలో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతూ... ఇక్క‌డ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య సైతం విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

గురునానక్‌ దేవ్‌ సమాధి నెలకొన్న దర్బార్‌ సాహిబ్‌ ను కలుపుతూ భారత్‌ - పాకిస్తాన్‌ లు కర్తార్‌ పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. ఈ కారిడార్‌ లో భాగంగా మ‌న‌దేశంలోని పంజాబ్‌ లో ఉన్న గురుదాస్‌ పూర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ మసీదుతో పాకిస్తాన్‌లోని కర్తార్‌ పూర్‌ ను అనుసంధానం చేస్తారు. క‌ర్తార్‌ పూర్ పాకిస్తాన్‌ లోని రావి న‌దీ తీరంలో ఉంది. మ‌న ప్ర‌యాణికులు ఎలాంటి వీసాలు లేకుండా అక్క‌డ‌కు వెళ్ల‌వ‌చ్చు. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌ లో ఈ కారిడార్‌ ను ప్రారంభించనున్నారు.

ఈ కారిడార్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌ ను ఆహ్వానిస్తున్న‌ట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తెలిపారు. మన్మోహన్‌కు మతం పట్ల విశ్వాసం ఉంది, ఆయనంటే పాకిస్థాన్ అమితమైన గౌరవం. అందుకే ఆయనకు ఆహ్వానం పంపబోతున్నాం అని ఖురేషీ చెప్పారు. ఏదేమైనా మ‌రోసారి పాక్ నిర్ణ‌యం తీవ్ర వివాస్ప‌దానికి కార‌ణ‌మ‌య్యేలా ఉంది.
Tags:    

Similar News