అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ చివురుటాకులా వణికిస్తోంది. ప్రస్తుతం అక్కడ కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పరిస్థితి చేయిదాటిపోతోంది.
అమెరికాలో గడిచిన 24 గంటల్లో నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 100 మంది చనిపోయినట్టు ప్రముఖ జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ నివేదికలో సంచలన విషయం వెల్లడించింది. ఈ వార్త తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది.
ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికాలో మరణాల సంఖ్య ఏకంగా 390కి చేరినట్టు అమెరికా ప్రభుత్వం ఆదివారం రిపోర్టు చేసింది. అత్యాధునిక వైద్య సేవలు ఉండే అమెరికాలో సైతం ఏకంగా ఒక్కరోజులో 100 మంది మరణించడం కలకలం రేపుతోంది. ఇది అమెరికన్లలో భయాందోళనకు కారణమవుతోంది.
తాజాగా సోమవారం అమెరికాలో కొత్తగా 33 మరణాలు సంభవించినట్టు వరల్డ్ ఓమీటర్స్. ఇన్ ఫో వెబ్ సైట్ పేర్కొంది. సోమవారంతో కలుపుకుంటే అమెరికాలో మరణాల సంఖ్య మొత్తం 452కు చేరింది.