జ‌స్ట్ మిస్‌ : పాక్‌ తో భారత్ యుద్ధం!!

Update: 2016-07-19 18:21 GMT
కొన్ని సంఘ‌ట‌న‌లు ఎంత కాల‌మైన ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. పైగా భార‌త్‌-పాకిస్తాన్ లాంటి శ‌త్రుత్వ దేశాలకు చెందిన‌వి అయితే...వాటికి ఉంటే ప్రాధాన్య‌మే వేరు. అందులోనూ అవి యుద్ధం వంటి విష‌యాల్లోని అయితే... ఆ ఆస‌క్తి ప్ర‌త్యేకంగా ఉంటుంది మ‌రి. కార్గిల్ స్థావ‌రం ఆక్ర‌మ‌ణ‌ స‌మ‌యంలో ఇలాగే జ‌రిగిన ఓ యుద్ధ తంత్రం గురించి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. పాక్‌ పై యుద్ధానికి సిద్ధమైన ఓ పైలెట్ రాసుకున్న డైరీతో పాటు ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్‌ వార్ ప్లాన్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగుచూసింది.

1999 మే నెలలో కార్గిల్‌ లోని భారత శిబిరాన్ని పాక్ ఆర్మీ ఆక్రమించిన సంగ‌తి తెలిసిందే. అయితే భారత్ ఓ వైపు ప్రతిఘటిస్తూనే మరోవైపు మంచి త‌నాన్ని పాటిస్తూ పాక్‌ తో చర్చలు జరిపింది. ఈ క్ర‌మంలో జూన్ 12న అప్ప‌టి బీజేపీ ప్ర‌భుత్వంలోని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌ - పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాక్‌ తో యుద్ధానికి భారత్ సన్నద్ధమైంది. జూన్ 13 తెల్లవారుజామున పాక్‌ లోని వైమానిక స్థావరాలపై దాడికి సిద్ధంగా ఉండాలని భారత వాయు సేనకు ఆదేశాలు అందాయి. ఇందుకోసం జమ్మూకశ్మీర్ ఎయిర్ బేస్ నుంచి నాలుగు మిగ్ 27 విమానాలకు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని టార్గెట్లను నిర్దేశించారు. అత్యాధునిక ఆయుధాలు కలిగిన రెండు మిగ్ 21 విమానాలతో పాటు ఇతర ఎయిర్ బేస్‌ ల నుంచి మరో పది మిగ్ 29 యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేశారు. దాడికి వెళ్ళే పైలెట్లకు రూట్ మ్యాపులు - రక్షణకు గన్స్ ఇచ్చారు. జూన్ 13 ఉదయం 6.30 గంటలకు పాక్‌ పై దాడికి సర్వం సిద్ధమైంది. అయితే ఆ రోజు ఉదయం మూడు గంటలకు పాక్‌ పై దాడికి దిగాల‌నే ఆదేశాలు ఆగిపోయాయి. దీంతో యుద్ధం ఆగిపోయింది. అయితే ఇంత ప‌క‌డ్బందీగా యుద్ధానికి సిద్ధమైన భారత దేశం అక‌స్మాత్తుగా ఎందుకు వెన‌క్కు త‌గ్గింది అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది.

మ‌రోవైపు ఆ స‌మ‌యంలోనే భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న ఆపరేషన్ విజయ్‌ తో కార్గిల్ స్థావరాన్ని భారత సైన్యం తిరిగి సొతం చేసుకుంది. పాక్ తోకముడ‌వ‌గా భార‌త సైన్యం విజ‌యం సాధించింది.
Tags:    

Similar News