కేఏపాల్..ప్రజాశాంతి అధ్యక్షుడైన ఈయనను పొలిటికల్ లీడర్ గా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేసే వ్యక్తిగానే ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. ఆయన ఏం కామెంట్ చేసినా ఇప్పుడు వైరల్ అవుతోంది. రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ విమర్శలు చేసే ఈయన తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పంచ్ లు వేశారు. జనసేన పార్టీ 'ప్రజాశాంతి'లో విలీనం చేసుకోవాలని, దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ ను సీఎం చేస్తానని అన్నారు. అంతేకాకుండా తాను పీఎం అవుతానని ఆసక్తికర కామెంట్ చేశారు. దీంతో కేఏపాల్ ను జనసైనికులు ఆటాడేసుకుంటున్నారు. తమదైన మీమ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.' పీఎం, సీఎం ఎవరైనా మనకు మంచి జోకర్ మాత్రం కేఏ పాల్’ అనే ఓ పోస్టు సంచలనలంగా మారింది.
సినిమాల్లోని కమెడియన్ల కంటే కేఏపాల్ ఎక్కువ వినోదాన్ని ఇస్తున్నారని కొందరు సెటైర్ వేస్తున్నారు. అందుకే కొందరు ఛానెళ్లు తమ ఛానెల్ రేటింగ్ కోసం ఆయనతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. తనకు మంచి ప్రచారం అవుతుందనుకున్న పాల్ పొలిటికల్ పంచ్ లు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఓ చానెల్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండానే వెళ్తానని అన్నారు. అలాగే దేశంలోని కొందరు రాజకీయ నాయకులు తన ఆశీర్వాదం తీసుకొని ఉన్నతస్థాయికి ఎదిగారని అన్నారు.
రాష్ట్రాల విషయానికొస్తే కేటీఆర్ ను టార్గెట్ చేశారు పాల్. గతంలో సిరిసిల్లలో ఆయనపై కొందరు దాడి చేశారు. అప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. త్వరలో తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం పలికారు.
అంతటితో ఆగకుంగా కాంగ్రెస్, బీజేపీలను సైతం కేఏపాల్ కడిగిపారేశారు. తమ పార్టీ ముందు ఏ పార్టీ గెలవలేదంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ తరుణంలో కేఏపాల్ న్యూస్ మేకర్ గా మారాయి. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వాటిని చాలా మంది ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో పార్టీ తీసుకోబోయే స్టెప్పుల గురించి వివరించారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్నారు. అయితే టీడీపీతో క్లారిటీ లేదని, ఎన్నికల సమయం వరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే ఒంటరిగానైనా జనసేన పోటీ చేస్తుందని అన్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది.
ఈ నేపథ్యంలో కేఏ పాల్ పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ మరో ఆప్షన్ పెట్టుకోవాలని అదే ప్రజాశాంతి పార్టీలో చేరడమని అన్నారు. జనసేనికులకు చిత్తశుద్ది ఉంటే తమ పార్టీలో చేరాలని అన్నారు. 2024లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ప్రధానమంత్రి అవుతానని, అప్పుడు పవన్ ను కచ్చితంగా సీఎంను చేస్తానని అన్నారు. దీంతో కేఏ పాల్ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాల్ పై సెటైర్లు వేస్తున్నారు. పీఎం, సీఎం ఎవరైనా మాకు ఎప్పటికైనా మంచి వినోదాన్ని ఇచ్చే వ్యక్తి మాత్రం పాల్ మాత్రమే అని ట్రోలింగ్ చేస్తున్నారు.