వైసీపీలో ఒక‌రు ఎడ్డెం... మ‌రొక‌రు తెడ్డెం... న‌మ్మేదెలా...!

Update: 2022-10-16 02:30 GMT
ఏదైనా ఒక విష‌యంపై.. నాయ‌కుల‌కు క్లారిటీ ఉండాలి. దానిని ముందు వారు న‌మ్మాలి. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల తో న‌మ్మించాలి. కానీ, ఇక్క‌డ వైసీపీలో రెండు ర‌కాలైన ప‌రిస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. ఒక‌టి..  ఇప్పుడు న్న రాజ‌ధానిని స‌మ‌ర్థించే వారు.రెండు మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడేవారు.

ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో తెలియ‌దు కానీ.. అస‌లు.. ఇప్ప‌టికీ.. చాలా మంది నాయ‌కుల‌కు..మూడు రాజ‌ధా నుల‌పై అవ‌గాహ‌న‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ఎందుకంటే.. ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎక్క‌డా మూడు రాజ‌ధానుల వ్య‌వ‌స్థ మ‌న‌కు లేదు. సో.. దీంతో వైసీపీ నాయ‌కులు దీనిపై అధ్య‌య‌నం చేయ‌లేక పోతున్నారట‌. అందుకే.. ఇప్పుడు.. ఎదురైన ప‌రిస్థితిని డీల్ చేయ‌లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. ఇక్క‌డ కూడా.. రెండు స్ప‌ష్ట‌మైన బేధాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. గ‌తంలో పాద‌యాత్ర సాగిన‌ప్పుడు.. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా.. ఎవ‌రూ ముందుకు రాలేదు. వ‌చ్చినా..  తూతూ మంత్రంగానే ఉద్య‌మించి ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

ముఖ్యంగా సీమ ప్రాంతాల్లో పెద్ద‌గా మూడు రాజ‌ధానుల‌పై ఎఫెక్ట్ లేదు. కేవ‌లం క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటును మాత్ర‌మే కోరుతున్నారు. ఇది.. గ‌తంలో చేసుకున్న పెద్ద మ‌నుషుల‌(డెలిగేష‌న్‌) ఒప్పంద‌మే. సో.. దీనిని ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన ప్రాధాన్యం అంటూ ఏమీలేదు. ఇక‌, మిగిలింద‌ల్లా.. విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డం. దీనిపై సీమ స‌హా.. కోస్తా జిల్లాల్లో పెద్ద‌గా నాయ‌కులు ప‌ట్టించుకోలేదు. అంటే.. వైసీపీలోని ఈ జిల్లాల నాయ‌కులు.. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కోరుకుంటున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక‌, ఇప్పుడు మాత్రం.. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నాయ‌కులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. అయితే.. దీనిపై ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. వారికే సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీనికి కార‌ణం.. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి కావాలంటే.. రాజ‌ధాని ఏర్పాటుతోనే సాధ్యం కాదని ఇక్క‌డి మేధావులు చెబుతున్నారు. వీరు త‌ట‌స్థంగానే ఉన్నారు. ఏ పార్టీకి.. ఏ రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా లేరు. దీంతో అస‌లు.. వైసీపీలోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ఉంద‌ని.. వారికే అవ‌గాహ‌న లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News