మన గణతంత్ర అతిథులను చూసి షాకవుతున్న ప్రపంచం

Update: 2018-01-26 02:25 GMT
    భారత దేశ 69వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు 10 దేశాల ప్రభుత్వాధినేతలను పిలిచి మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు భారత్ ఇతర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీగానే వస్తున్నా, ఒకేసారి పది దేశాధినేతలను పిలవడం మాత్రం ఇదే తొలిసారి. అందులోనూ వారంతా ఆసియా దేశాలకు చెందినవారు కావడంతో ప్రపంచ రాజకీయాలపరంగానూ ఇదెంతో కీలక పరిణామం అని చెప్పాలి.

    ఆగ్నేయాసియా దేశాల కూటమి(అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏసియన్ నేషన్స్)-భారత్ స్నేహసంబంధాలకు పాతికేళ్లు పూర్తియన నేపథ్యంలో ఆసియాన్‌లోని పది సభ్యదేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవాలకు ఆహ్వానించారు మోదీ. కాగా.. మోదీ పిలుపుతో  ఆసియా దేశాల అధినేతలు వచ్చివాలడంతో చైనా - పాక్ వంటి దేశాలు అసూయ పడుతున్నాయి. ఆసియాలో భారత్ పూర్తిగా పట్టు సాధించనుందని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
వచ్చింది వీరే...

1) సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్
2) ఇండొనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
3) మలేషియా ప్రధాని డాటో శ్రీ మొహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్
4) మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ
5) ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే
6) థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్-ఓ-చా
7) బ్రూనై సుల్తాన్ హజీ హసన్‌లాల్ బోల్‌కియా
8) వియత్నాం ప్రధాని ఎన్‌గుయెన్ గ్సువాన్ ఫ్యుక్
9) కంబోడియా ప్రధాని హున్ సెన్
10) లావోస్ ప్రధాని థాంగ్లౌన్ సిసౌలిథ్
Tags:    

Similar News