పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ - బంగ్లాదేశ్ లోని హిందువులు - కాందీశీకులు భారత్ లో తలదాచుకుంటే వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు ఇప్పటికే ఆమోదం తెలిపిన కేంద్రం తాజాగా విదేశాల్లోని భారతీయులకు శుభవార్తను చెప్పింది.
భారత్ కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశాల్లోని భారతీయులకు భారత ప్రభుత్వం ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ)కార్డ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకు నిబంధనలను పొందుపరిచింది.
20 ఏళ్లలోపు వారు.. లేదా 50ఏళ్ల పైబడిన వయసున్న వారు ఇటీవలే తమ పాస్ పోర్ట్ ను రెన్యువల్ చేయించుకొని భారత్ కు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న వారు ఈ ఓసీఐ కార్డ్ కు అర్హులని కేంద్రం తెలిపింది.
దీనికి గాను వారు ఓసీఐ కార్డ్ తోపాటు కొత్త పాస్ పోర్ట్ - రద్దైన పాత పాస్ పోర్ట్ రెండూ తమ వద్ద పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్ కు రావచ్చని కేంద్ర హోంశాఖ విదేశాంగ విభాగం మంగళవారం ప్రకటించింది. 2020 జూన్ 30 వరకు ఈ వెసులుబాటు కల్పించామని పేర్కొంది.