టీమ్‌ ఇండియా పర్‌ ఫ్యూమ్‌ పెట్రోలై మండుతోంది

Update: 2019-01-18 12:34 GMT
ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియా సత్తా చాటింది. టెస్ట్‌ సిరీస్‌ గెలవడమే కాదు… వన్డే సిరీస్‌ ని కూడా గెలిచి ఆస్ట్రేలియాపై తొడ కొట్టారు మన కుర్రాళ్లు. ఇలా సిరీస్‌ లు గెలవడం మన వాళ్లకు కొత్త కాదు కానీ విదేశీ గడ్డపై అది కూడా ఆస్ట్రేలియా లాంటి నెంబర్‌ వన్‌ జట్టుపై గెలవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మధ్యలో మనల్ని ఓడించడానికి వరుణుడు ఎన్ని కష్టాలు పడినా.. అంతిమంగా విజయం మనవాళ్లదే అయ్యింది.

విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ అయిన తర్వాత టీమ్‌ ఇండియా సభ్యుల్లో బాగా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్తే.. సిరీస్‌ గెలవకపోయినా ఫర్వాలేదు.. ఓడిపోకూడదు అనే డిఫెన్స్‌ మోడ్‌ లో ఆడేవాళ్లు. కానీ ఇప్పుడు అలాకాదు. విదేశానికి వెళ్తే.. గెలిచే వెళ్లాలి అనే కసి కన్పిస్తోంది. అన్నింటికి మించి ఒకప్పుడు స్లెడ్జింగ్‌ తో మనవాళ్లు ఇబ్బందిపడేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రత్యర్థికి ఒకటి అంటే.. మనవాళ్లు రెండు మాటలంటున్నారు. దీనికంతటికి కారణం..విరాట్‌ కోహ్లి నాయకత్వ మహిమే.
   
ఆవేశంతో అద్భుతాలు చేసే కుర్రాళ్లు - ఆలోచనతో ఆపత్కాలంలో ఆదుకునే ధోనీ లాంటి సీనియర్లు ఇప్పుడు టీమ్ ఇండియాకు ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన  చివరి వన్డేలో ధోనీ ఆడిన తీరుని ఎవ్వరూ మర్చిపోలేరు.  చాలా బ్యాలెన్స్‌ డ్‌ గా తన సీనియారిటీ చూపించాడు. ఇప్పుడు టీమ్‌ ఇండియా పర్‌ ఫెక్ట్‌ గా ఉంది. అందుకే వరుస విజయాలు వరిస్తున్నాయి. ఇదే ఊపుతో ఆడితే.. ఈసారి వరల్డ్‌ కప్‌ ఇండియాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Full View
Tags:    

Similar News