చైనాకు ధీటుగా భారత్ 'రాకెట్ ఫోర్స్' మోహరింపు..!

Update: 2022-12-26 09:01 GMT
సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ వేస్తున్న వేషాలకు సరైన జవాబు చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. గాల్వాన్ ఘటన.. అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాట్లతో చైనా తరుచూ భారత్ ను కవ్విస్తోంది. దీనికితోడు భారత్ తో సరిహద్దు గొడవ జరగగానే చైనా తన వాస్తవాధీన రేఖ వెంబడి రాకెట్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ సైతం రాకెట్ ఫోర్స్ పై దృష్టి సారించింది.

భవిష్యత్తులోనూ యుద్ధాలన్నీ శత్రువు తేరుకునేలోపే దెబ్బకొట్టేలా జరగనున్నాయి. ఈ యుద్ధంలో క్షిఫణులు.. డ్రోన్లు.. సైబర్ ఆయుధాలే కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ ట్యాంకులు.. సైనికుల పోరాటాల కంటే కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే స్టాండ్ అప్ ఆయుధాలు.. సైబర్ ఆయుధాలు.. రహస్య కార్యకలాపాలతోనే జరుగనున్నాయని బ్రిగేడియార్ బిమల్ మెంగా పేర్కొన్నారు.

చైనా వద్ద 1966 నుంచే  రాకెట్ ఫోర్స్ ఉంది. 2015లో పీఎల్ఏ 2వ ఆర్టిలెరీ ఫోర్స్ పేరును మార్చి రాకెట్ ఫోర్సుగా నామకరణం చేసింది. దీని వద్దే చైనాకు చెంది అత్యాధునిక అణ్వాయుధాల ఉన్నాయి. మూడేళ్ల కాలంలో దీని సైజు 33 శాతం పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. దీని పరిధిలోని భారత్ లోని అన్ని నగరాలు వస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలోనే భారత్ తో సరిహద్దు వివాదం జరిగిన వెంటనే చైనా తన రాకెట్ ఫోర్స్ ను వాస్తవధీన వెంట మోహరిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ సైతం రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు గతేడాది సెప్టెంబర్ లోనే దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రళయ్ క్షిపణి ప్రయోగాలను భారత్ వేగవంతం చేస్తోంది. ఈ క్షిపణితో 150 నుంచి 500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించవచ్చు.

ఈ ప్రళయ్ క్షిపణి  క్వాజీ బాలిస్టిక్ విధానంలో ప్రయాణించనుంది. అంటే బాలిస్టిక్ క్షిపణి మాదిరిగానే వెళ్లినా అవసరమైన దిశ మార్చుకోగలదు. తద్వారా శత్రువు గగన రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించలేవు. దీని ద్వారా వాస్తవధీన రేఖ వెంబడి మోహరించిన చైనా సైనిక మౌలిక వసతులను ఇది ధ్వంసం చేయగలదు. గత 24 గంటల్లో ఈ క్షిపణని భారత్ రెండు సార్లు పరీక్షించింది. 120 క్షిపణులు కొనుగోలు కు రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.

మరోవైపు అగ్ని-5 ఖండాతర క్షిపణి పరిధిలోకి చైనాలోని అన్ని నగరాలు టార్గెట్ చేయడానికి అవకాశముంది. సరిహద్దుల్లో ప్రళయ్ క్షిపణి అందుబాటులోకి వస్తే చైనా రాకెట్ ఫోర్స్ ను భారత్ ఈజీగా ఎదుర్కోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ ప్రళయ్ క్షిపణిని రోడ్డు మార్గంలో తరలించే అవకాశం కూడా ఉంది.

అగ్ని వంటి దీర్ఘ శ్రేణి క్షిపణులతో పాటు బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి భారత అమ్ముల పొదిలో ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణి పోలిస్తే ప్రళయ్ క్షిపణులు చాలా చౌకగా తయారు కానుండటంతో భారత్ కు కలిసొచ్చే అవకాశంగా కన్పిస్తోంది. భారత్ ఎల్లప్పుడు శాంతి మంత్రాన్నే జపిస్తున్నా.. ప్రత్యర్థులు దానిని అలుసుగా తీసుకుంటే మాత్రం ధీటుగా జవాబిచ్చేందుకు ఎల్లప్పుడు రెడీగానే ఉంటుంది. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News