ఆ 15 లక్షల మందిలో ఏ ఒక్కరిని వదలకండి

Update: 2020-03-28 03:30 GMT
భారత ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 18 నుండి మార్చి 23 వరకు విదేశాల నుండి అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చిన 15 లక్షల మందిని వెంటనే గుర్తించాలని నిర్ణయించింది. ఈ రెండు నెలల్లోనే విదేశాల నుండి 15 లక్షల మంది వచ్చినట్లుగా ఇమిగ్రేషన్‌ నుండి కేంద్రంకు రిపోర్ట్‌ అందిందట.

కేంద్రం తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాలకు విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రేస్‌ చేయాలని ఆదేశించింది. ఆ 15 లక్షల మందిలో ఏ ఒక్కరు మిస్‌ కాకుండా వారిని అదుపులోకి తీసుకోవాలంటూ సూచించింది. వారిని ట్రేస్‌ చేయడం తో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను వారు ఇప్పటి వరకు కలిసిన జనాలను కూడా గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోవిడ్‌ 19 క్రైసిస్‌ మేనేజిమెంట్‌ గ్రూప్‌ కు నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌ గౌబా ఆదేశాలు జారీ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించాడు. ఆ 15 లక్షల మందిని మానిటరింగ్‌ చేయడంలో గ్యాప్‌ ఏర్పడినదని అందుకే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు నిఘాలో ఉంచి వారందరిని కూడా రాడార్‌ కిందకు తీసుకు రావాల్సిందిగా ఆయన అన్నారు. ఆ 15 లక్షల మందికి చెందిన ట్రాకింగ్‌ రిపోర్ట్‌ ను సిద్దం చేయాలని కూడా అన్నారు.
Tags:    

Similar News