కాలం గడుస్తున్నకొద్దీ.. నాగరికత అంతకంతకూ పెరుగుతున్న కొద్దీ విలువలు.. ప్రమాణాలు పెరుగుతూ ఉండాలి. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనటం ప్రజాస్వామ్య భారతానికి ఏ మాత్రం మంచిది కాదు. చేసిన మంచి గురించి ప్రచారం చేసుకోవటం మంచిది కాదు. కానీ.. వ్యవస్థలకు ఉండే లక్ష్మణ రేఖల్ని దాటేయటం ఏ మాత్రం మంచిది కాదు. సున్నితమైన..కీలకమైన దేశ భద్రతకు సంబంధించిన అంశాల మీద ప్రచారం సరికాదు.
ఎన్నికలున్నా లేకున్నా దేశ భద్రతను రాజకీయాల్లోకి.. ఎన్నికల ఎజెండాలోకి తీసుకురావటం సరైన పద్దతి కాదు. మిస్సైల్ లో శాటిలైట్ ను ధ్వంసం చేసే శక్తికి సంబంధించిన మిషన్ శక్తి ఆపరేషన్ ను ఎన్నికల వేళలో అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే లేదని చెప్పాలి. కానీ.. ఇందుకు భిన్నంగా ఈ ఆపరేషన్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించటం.. దీనిపై విపక్షాలు విరుచుకుపడటం చూస్తున్నదే.
సొంత టెక్నాలజీతో రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఒకటి కక్ష్యలో తిరుగుతున్న ఒక శాటిలైట్ ను విజయవంతంగా కూల్చి వేసే అద్భుతమైన సాంకేతికతకు సంబంధించిన ప్రయోగం ఫలితానికి దేశ ప్రజలంతా పండుగ చేసుకోవాల్సిందే. అయితే.. ఇది నిర్వహించాల్సిన సమయం ఎప్పుడైనా ఫర్లేదు. కానీ.. దానికి సంబంధించిన సమాచారం బయటకు రావాల్సింది మాత్రం ఎన్నికల వేళలో మాత్రం కాదు.
కానీ.. ఇందుకు భిన్నంగా ఎన్నికల వేళ విడుదలైన ఈ ప్రయోగ వివరాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ ప్రయోగ వివరాల్ని ప్రకటించటం కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందటానికేనంటూ మోడీ సర్కారు మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదం ఇలా సాగుతున్న వేళ.. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన డీఆర్ డీవో తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. తాము డెవలప్ చేసిన సాంకేతికతతో పాటు.. తాము జరిపిన ప్రయోగాన్ని వివరిస్తూ ఈ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ వీడియో మొదట్లోనూ.. చివర్లోనూ ప్రధాని మోడీని పొగిడేసిన తీరు చూస్తే.. ఈ వీడియో విడుదల వెనుక అర్థం.. పరమార్థం ఏమిటో అర్థమయ్యే పరిస్థితి. ఒడిశాలోని కలామ్ ఐలాండ్ నుంచి మార్చి 27న నిర్వహించిన ఏశాట్ ప్రయోగంలో.. భూ ఉపరితలానికి 283 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఒక పాత ఉపగ్రహాన్ని ఏ శాట్ కేవలం 3 నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేసింది.
ప్రపంచంలో ఈ తరహా టెక్నాలజీ ఉన్న నాలుగో దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే.. ఇదంతా రక్షణ శాఖ క్రెడిట్ కింద ఉండాలే కానీ.. దీన్ని మోడీ ప్రభుత్వ విజయంగా పేర్కొంటూ పరోక్ష ప్రచారానికి దిగటం ఆరోగ్యకరమైన పరిణామం ఎంత మాత్రం కాదు. జాతీయ భద్రతా సంస్థలు రాజకీయ క్రీడల్లో పావులు కాకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.