వెస్టిండీస్ టూర్ కు భారత జట్టు ఇదే..!

Update: 2019-07-21 10:25 GMT
ప్రపంచకప్ సెమీస్ లో ఘోర ఓటమి తర్వాత జట్టులో విభేదాలున్నాయని.. వెస్టిండీస్ టూర్ లో కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతిని ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ దీనికి కోహ్లీ ఒప్పుకోకుండా ఆడుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ముంబైలో వెస్టిండీస్ టూర్ కు భారత జట్టును ఎంపిక చేశారు.

వెస్టిండీస్ టూర్ లో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మూడు ఫార్మట్ లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీనే ఎంపిక చేశారు. అనూహ్యంగా టెస్ట్ టీమ్ కు తెలుగు ఆటగాడు హనుమ విహారికి చోటుదక్కింది. వన్డేల్లో అనూహ్యంగా నాలుగోస్థానం ఖాళీగా ఉండడంతో ఆ స్తానంలో యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్  మనీష్ పాండే లను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు.

ఇక గాయం కారణంగా ప్రపంచకప్ కు దూరమైన శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో - టీట్వంటీల్లో కోహ్లీ కెప్టెన్ గా - రోహిత్ వైఎస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

వన్డే జట్టు: కోహ్లీ (కెప్టెన్) - రోహిత్(వైఎస్ కెప్టెన్) - శిఖర్ - కేఎల్ రాహుల్ - శ్రేయస్ అయ్యర్ - మనీష్ పాండే - రిషబ్ పంత్ - రవీంద్ర జడేజా - కులదీప్ - చాహల్ - కేదార్ జాదవ్ - షమీ - భువనేశ్వర్ - ఖలీల్ అహ్మద్ - నవదీప్ శైనీ

టీ20 జట్టు: కోహ్లీ (కెప్టెన్) - రోహిత్(వైఎస్ కెప్టెన్) - శిఖర్ - కేఎల్ రాహుల్ - శ్రేయస్ అయ్యర్ - మనీష్ పాండే - రిషబ్ పంత్ - కృణాల్ పాండ్యా రవీంద్ర జడేజా  - వాషింగ్టన్ సుందర్  - రాహుల్ చాహర్ - భువనేశ్వర్ - ఖలీల్ అహ్మద్ - దీపక్ చాహర్ నవదీప్ శైనీ

టెస్టు జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్) - అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్) - మయాంక్ అగర్వాల్ - కేఎల్ రాహుల్ -  పుజారా - హనుమ విహారా - రోహిత్ శర్మ - రిషబ్ పంత్(వికెట్ కీపర్) - వర్ధమాన్ సాహా(వికెట్ కీపర్) - అశ్విన్ -  జడేజా - కులదీప్ - ఇషాంత్ శర్మ - షమీ - బుమ్రా - ఉమేష్ యాదవ్.


Tags:    

Similar News