ల‌వ్ జిహాద్ లెక్క‌తేల్చిన స్టింగ్ ఆప‌రేష‌న్

Update: 2017-11-02 05:10 GMT
ల‌బ్ జిహాద్ పేరుతో సాగుతున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇది నిజ‌మ‌ని హిందూ సంస్థ‌లు చెబుతుంటే.. ఇందులో నిజం లేద‌ని.. ఇదంతా సంఘ్ ప‌రివార్ విష ప్ర‌చారంగా కొట్టిపారేసే వారు లేక‌పోలేదు. అయితే.. ల‌వ్ జిహాద్ నిజ‌మ‌ని.. భారీ కుట్ర‌గా సాగుతున్న ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ ఒక‌టి బ‌ద్ధ‌లు కొట్టింది.

ప‌థ‌కం ప్ర‌కారం అన్య మ‌తాల‌కు చెందిన అమ్మాయిల్ని ల‌క్ష్యంగా చేసుకొని వారిని ఇస్లాంలోకి మార్చ‌ట‌మే ల‌వ్ జిహాద్ ఉద్దేశం. ఇందులో భాగంగా కేర‌ళ‌కు చెందిన కొంద‌రు ఈ దారుణానికి పాల్ప‌డుతున్నారు. ఇండియా టుడే ఛాన‌ల్ ఒక‌టి ఈ వ్య‌వ‌హారం మీద స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి.. ల‌వ్ జిహాద్ వెనుకున్న కుట్ర‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

23 ఏళ్ల హిందూ వైద్య విద్యార్థిని అఖిల హ‌దియాగా మారింది. ఇస్లాంను స్వీక‌రించిన స‌ద‌రు యువ‌తి చేసుకున్న పెళ్లి బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌న‌మైంది. త‌న భ‌ర్త స‌ఫిన్ జ‌హాన్ తో ఉంటాన‌ని ఆమె ప‌ట్టుబ‌ట్ట‌గా.. త‌న కుమార్తెను ల‌వ్ జిహాదీ నుంచి త‌ప్పించాలంటూ ఆమెతండ్రి అశోక‌న్ సుప్రీంకోర్టు వ‌ర‌కు పోరాటం చేశారు.

ఆమె వివాహాన్ని కేర‌ళ హైకోర్టు ర‌ద్దు చేసింది. దీనిపై సుప్రీంలో ప్ర‌స్తుతం వ్యాజ్యం న‌డుస్తోంది. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో జాతీయ ద‌ర్యాఫ్తు సంస్థ నేతృత్వంలో ల‌వ్ జిహాద్ పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. అఖిల‌ను హ‌దియాగా మార‌టంలో కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా చెబుతున్న పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీవో సంస్థ‌పై ఇండియా టుడే స్టింగ్ గురి పెట్టింది.

ఆ ఎన్జీవో సంస్థ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు జైన‌బా మాట్లాడుతూ దొరికిపోయారు. తాను అన్య మ‌తాల‌కు చెందిన అమ్మాయిల‌ను ఇస్లాంలోకి మారుస్తున్న విష‌యాన్ని అంగీక‌రించారు. ఇంత దారుణానికి పాల్ప‌డుతున్న జైన‌బా అఖిల భార‌త ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు స‌భ్యురాలు కావ‌టం గ‌మ‌నార్హం. ఇండియా టుడే స్టింగ్ ఆప‌రేష‌న్ లో బ‌య‌ట‌పడిన ఆమె మాట‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

అయితే.. తాను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేద‌ని.. తాను మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డ‌లేదంటూ జైన‌బా బుధ‌వారం మీడియాకు చెప్పిన‌ప్ప‌టికీ.. ఆమె మాట్లాడిన మాట‌లు బ‌య‌ట‌కు రావ‌టంతో ఆమె మాట‌ల్ని ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 2013లోనే హ‌దియా ఇస్లాంలోకి మారింద‌ని.. 2015లో ఆమె పీఎఫ్ ఐ అనుబంధ సంస్థ స‌త్య‌శ‌ర‌ణిలో చేరేందుకు వ‌చ్చిన‌ప్పుడు ప‌రిచ‌య‌మైంద‌ని చెప్పారు. తాము 5వేల మంది హిందూ.. క్రిస్టియ‌న్ యువ‌తుల్ని ఇస్లాంలోకి మార్చిన‌ట్లుగా గ‌ర్వంగా చెప్పారు జైన‌బా భ‌ర్త అలీ.

నాలుగేళ్ల క్రితం ఎమ్మెస్సీ మ్యాథ్స్‌.. బీఈడీ చేసిన శుభ అనే అమ్మాయిని మ‌తం మార్చామ‌ని.. ఇప్పుడామె ఫాతిమాగా స్థిర‌ప‌డింద‌ని చెప్పారు. మ‌తం మారుతున్న వారిలో చ‌దువుకున్న వాళ్లు ఉన్న‌ట్లుగా చెప్పారు.  ఎన్జీవో ముసుగులో తాము ఈ ప‌నులు చేస్తున్న‌ట్లుగా స్టింగ్ ఆప‌రేష‌న్ పేర్కొంది.

విద్యా సంస్థ‌గా రిజిస్ట‌ర్ అయిన స‌త్య‌శ‌ర‌ణి సైతం మ‌త‌మార్పిళ్ల‌ను చేస్తుంద‌ని.. మ‌తం మార్చిన త‌ర్వాత స‌ర్టిఫికేట్ల‌ను తీసుకురావ‌టం కూడా స‌ద‌రు సంస్థ బాధ్య‌గా వారు చెప్పారు. తొలుత భార‌త్‌ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాక‌.. ప్ర‌పంచ‌మంతా త‌మ కార్య‌క‌లాపాల్ని విస్త‌రిస్తామ‌న్నారు. మ‌త మార్పిళ్ల కోసం అర‌బ్బులు పెద్ద ఎత్తున నిధులు హ‌వాలా ప‌ద్ధ‌తిలో పంపుతున్న‌ట్లుగా వారు చెప్పారు. ఇలా తాము చేసే ఆరాచ‌కాల్ని వివ‌రంగా చెప్పిన వైనం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News