దక్షిణాఫ్రికాను ధీటుగా ఓఢించి ప్రపంచకప్ వేటను ప్రారంభించిన ఇండియాకు ఈరోజు అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది. మొన్నటి వరకు ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు.. ప్రపంచకప్ లో ఏమేరకు రాణిస్తారనే డౌట్లు ఉండేవి. కానీ దక్షిణాఫ్రికాతో ఆడిన తీరు చూశాక భారత్ కు బెంగ తీరింది. ఇప్పుడు టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా భారత్ ముందుంది.
అయితే ఇది రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతి. మొత్తం ప్రపంచకప్ లోని 10 జట్లు మిగతా 9 జట్లతో పోటీపడాల్సిందే. దీంతో ఈ ప్రపంచకప్ లోనే టోర్నీ ఫేవరెట్ లలో రెండుగా పేరున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను భారత్ ఎదుర్కోవాలి. కానీ భారత్ తన రెండో మ్యాచ్లోనే ఈరోజు ఆస్ట్రేలియాను ఢీకొంటోంది.
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో గత ఏడాది భారత్ చిత్తుగా ఓడించింది. అయితే ఆ జట్టులో అప్పుడు సస్పెన్షన్ కు గురైన స్మిత్, వార్నర్ లేరు.కానీ ఇప్పుడు వారి చేరికతో ఆస్ట్రేలియా బలం కొండంత పెరిగింది.వెస్టిండీస్ తో మ్యాచ్ లో స్మిత్ మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు బౌలింగ్ లో ప్రపంచంలోనే ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, కమిన్స్ భీకరంగా చేస్తున్నారు.
ఇక భారత్ తొలి మ్యాచ్లోనే దక్షిణాఫ్రియా స్పిన్ బలహీనతను ఎత్తి చూపుతూ ఆ జట్టును తిప్పేసింది.చాహల్ - కులదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. రోహిత్ చివరి వరకు ఉండి గెలిపించారు.
ప్రధానంగా ఈ రెండు జట్ల పోరు ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం చెప్పడం కష్టంగా ఉంది. నాకౌట్ లో ఎలాగూ ఆస్ట్రేలియా రావడం ఖాయం. దీంతో ఇప్పుడే ఓడిస్తే కొండంత బలం వస్తుంది. ఆస్ట్రేలియాతో బాగా బౌలింగ్ రికార్డు ఉన్న షమీని ఈ మ్యాచ్ లో భారత్ తీసుకునే అవకాశాలున్నాయి.