ప్రపంచకప్: భారత్ ఫైనల్ కే..అదృష్టమిదీ..

Update: 2019-07-10 04:31 GMT
ప్రపంచకప్ సెమీస్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్. 100 కోట్ల మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలు.. టాస్ వేశాడు భారత్ కెప్టెన్ విరాట్  కోహ్లీ. అందరికీ షాక్. న్యూజిలాండ్ కెప్టెన్ గెలిచాడు. వెంటనే బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ పిచ్ లపై 90శాతం బ్యాటింగ్ ముందు చేసిన జట్లే గెలిచాయి. అందుకే భారత్ మ్యాచ్ ఓడిపోతుందా అన్న కంగారు.  ఏదో అపశకునం.. భారతీయ విశ్లేషకులు - స్టేడియంలోని వారు అంతా నిరాశ. కానీ అదృష్టం మన వెంటే నిలిచింది.

టాస్ ఓడినా భారత బౌలర్లు భువనేశ్వర్ - బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ ఫ్రీజ్ అయిపోయింది. తొలి రెండు ఓవర్లు మెయిడెన్. 10 ఓవర్లలో 27 పరుగులకే ఒక వికెట్. ఇలా టాస్ గెలిచిన సంతోషం న్యూజిలాండ్ కు లేకుండా పోయింది. ఇక్కడే మ్యాచ్ భారత్ వైపు నిలిచింది. న్యూజిలాండ్  అష్టదిగ్భంధనం చేసి భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 46.1 ఓవర్లలో 211 పరుగులకే పరిమితమైంది. ఇది భారత్ కు తొలి అదృష్టంగా మారింది.

ఇక రెండో అదృష్టం ఏంటంటే.. మ్యాచ్ కు వరుణుడు అడ్డొచ్చాడు. 46.1 ఓవర్లకు ఆట ఆగింది. అదే పిచ్ పై రెండోసారి బ్యాటింగ్ చేస్తే భారత్ గెలవడం కష్టం. కానీ మరుసటి రోజుకు మ్యాచ్ వాయిదా పడింది. దీన్ని బట్టి ఈరోజు కొనసాగుతుంది. న్యూజిలాండ్ నాలుగు ఓవర్లు ఆడి భారత్ కు అప్పగిస్తుంది. అంటే భారత్ ఫ్రెష్ వికెట్ పై మొదట బ్యాటింగ్ చేసినట్టే. ఈ పరిణామం భారత్ కు బాగా కలిసివచ్చేది.

అందుకే వరుణుడు మ్యాచ్ ను ఆటంకం పరిచి భారత్ ను ఓరకంగా కాపాడినట్టే. రెండోసారి బ్యాటింగ్ కష్టం. అందుకే బుధవారం తొలి సెషన్ లో బ్యాటింగ్ చేయడం సులువు. ఇలా భారత్ విజయంలో అన్నీ కలిసివచ్చాయి. ఇక ఈరోజు కూడా వర్షం పడినా బేఫికర్. ఎందుకంటే గ్రూపులో టాప్ లో ఉన్న మన జట్టే ఫైనల్ చేరుతుంది.


Tags:    

Similar News