మోడీ కోరుకున్నంత కాకున్న..రిజ‌ల్ట్ ప‌ర్లేదు

Update: 2015-10-28 07:47 GMT
ప్ర‌పంచంలో 189 దేశాల్లో వ్యాపార అనుకూల దేశాల జాబితాను ప్రపంచం బ్యాంక్‌ విడుదల చేసింది. 2016 సంవత్సరానికి గాను వ్యాపార అనుకూల దేశాల జాబితాలో ఈ సారి భారత్‌ స్థానం మెరుగుపడింది. 142 నుంచి 130వ స్థానానికి భారత్‌ చేరుకున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.  గత ఏడాది 128వ స్థానంతో మనకంటే మెరుగ్గా ఉన్న పాకిస్థాన్‌ ఈసారి 138వ స్థానంలో నిలిచింది. ఆగ్రస్థానంలో సింగపూర్‌ - రెండో స్థానంలో న్యూజిలాండ్‌ - మూడో స్థానంలో డెన్మార్క్‌ - నాలుగో స్థానంలో దక్షిణ కొరియా - ఐదో స్థానంలో హాంకాంగ్‌ - ఆరో స్థానంలో బ్రిటన్‌ ఉన్నాయి. మన పొరుగు దేశం చైనా గత ఏడాది 90 స్థానంలో ఉండగా, ఈ సారి ఆరు పాయింట్లతో 84వ స్థానంలో నిలిచింది.

వ్యాపార అనుకూల దేశాల్లో భార‌త్ ఏటా 50 స్థానాలు ఎగ‌బాకాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ గ‌తేడాది ఆకాంక్షించారు. ప్ర‌స్తుత ర్యాంకింగ్‌ లో అంత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌న‌ప్ప‌టికీ 12 స్థానాలు మెరుగుప‌డ‌టం శుభ‌ప‌రిణామంగా ఆర్థిక‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఈ ర్యాంకింగ్‌ పై వ‌ర‌ల్డ్ బ్యాంక్ చీఫ్ ఎక‌న‌మిస్ట్ కౌశిక్ బ‌సు మాట్లాడుతూ.... భార‌త‌దేశం చ‌క్క‌టి ప‌నితీరు క‌న‌బ‌ర్చింది. "ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇండియా ఇంత ర్యాంక్‌ ను సాధించ‌డం సానుకూల ప‌రిణామ‌మే" అని అన్నారు. ప‌ది పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంక్‌ ల‌ను కేటాయించారు.
Tags:    

Similar News