భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైనా ఆర్మీ చొరబాట్లు ఎక్కువయ్యాయి. తాజాగా శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి రావడంతో చైనా ఆర్మీ కుతంత్రాలు వెలుగుచూశాయి.
భారత భూభాగంలోని గాల్వాన్ లోయలో చైనీస్ ఆర్మీ రెండు వారాలపాటు తిష్టవేసి గాల్వాన్ నదీ జలాలను మళ్లించినట్టు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. ఓవైపు చర్చలు జరుపుతూనే కవ్వింపు చర్యలకు చైనా దిగడంపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పు లఢక్ లోని పాంగాంగ్ సర్సు, గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ అక్రమంగా ప్రవేశించినట్టు ‘దిప్రింట్’ అనే మీడియా సంస్థ శాటిలైట్ చిత్రాలు విడుదల చేసింది. మే మొదటి వారం నుంచి నాలుగో వారం దాకా 50కిపైగా చైనా సైనిక బృందాలు గాల్వాన్ లోయలో కార్యకలాపాలు సాగించినట్టు తేల్చింది. గాల్వాన్ నదిపై భారత్ వంతెన నిర్మించానుకుంటుండడగా.. డ్రాగన్ ఏకంగా ఆ నదీ జలాలనే మళ్లించినట్టు వెల్లడైంది.
గాల్వాన్ నదీ జలాల మళ్లింపు తో భారత్ కు రానున్న రోజుల్లో తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చైనాను సవాల్ చేయకుంటే నదీ జలాలు చైనాకు పోవడం .. భారత్ నష్ట పోవడం ఖాయం.
భారత్-చైనా మధ్య నదీజలాల వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. మొత్తం నదీజాలల పరిణామంలో 48శాతం ఒక్క భారత్ లోకే ప్రవహిసతున్నాయి. ఎగువన ఉన్న చైనా ఇప్పటికే భారతదేశానికి కీలకమైన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లేజ్ నదులపై అడ్డగోలుగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించింది. భారత్ అభ్యంతర పెడుతున్నా చైనా మాత్రం వాడుకుంటోంది. తాజాగా గాల్వాన్ జలాల మళ్లింపుతో చైనా దుశ్చర్యకు పాల్పడుతోంది.
చైనా సరిహద్దు వివాదం.. జలాల మళ్లింపుపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరుపుతూనే చైనా భారీగా బలగాలను మోహరిస్తోందని..చర్చలు లేని పక్షంలో ఘాటుగానే స్పందిస్తామని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఢోక్లాంలోనూ ఇలాగే వ్యవహరించారని.. ప్రస్తుతం చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటామన్నారు. ఇరువైపులా సైన్యాధికారులు మరోసారి చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
ఇక భారత దేశం కూడా ఎంతకూ తగ్గడం లేదు. తూర్పు లఢక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ మధ్య భారత్ 255 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తోంది. దీన్ని చైనా ఖండిస్తోంది. అడ్డుతగులుతూ కవ్విస్తోంది. భారీగా సైనికులను మోహరించి అడ్డుతగులుతున్నా భారత్ వెనక్కి తగ్గడం లేదు. జార్ఖండ్ నుంచి 12 వేల మంది కార్మికులను తరలించేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తోంది. భారీగా సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని భారత్ సైతం చైనా సరిహద్దులకు తరలిస్తోంది.