`క్రిప్టో` కష్టాలు.. ఇన్నిన్ని కావుగా.. మోడీ కూడా బ్యాన్ చేస్తున్నారే!
వందల పెట్టుబడి.. వేలకు వేలు లాభం.. అది కూడా ఇంట్లో కూర్చునే!-అంటే.. ఎవరు మాత్రం వద్దంటారు? ఎవరు మాత్రం దూరంగా ఉంటారు? అదే క్రిప్టో మాయగాళ్లకు పెద్ద వ్యాపారం. ఎదుటి మనిషిలోని మానసిక దౌర్బల్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అతిపెద్ద బ్లాక్ చైన్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ బిజినెస్. ఇప్పుడు ప్రధానంగా ఇది దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఎందుకంటే.. దీనిని మన దేశంలో నిషేధిస్తుండడమే! సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీబిల్లును ప్రవేశ పెట్టనున్నారు. రియల్ ఎస్టేట్, మనీ ల్యాండరింగ్, మానవ అక్రమ రవాణా, ఆయుధాల కొనుగోలు, మాదకద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న క్రిప్టోను దేశంలో నిషేధించాలని.. మోడీ సర్కారు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది.
1000 కోట్ల డాలర్లకు..
దీంతో దేశంలో ఉన్న క్రిప్టో కంపెనీలు.. ఇక మూసేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనదేశంలో క్రిప్టో కంపెనీలు 20 ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా సుమారు 75 వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. క్రిప్టో కరెన్సీకి ఆదిలో కన్నా.. కరోనా సమయంలో క్రేజ్ పెరిగింది. 2020 ఏప్రిల్ లో 90 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉంటే.. ఇవి 2021 నవంబర్ కు వెయ్యి కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అయితే.. ఇవి నికర ఆదాయం ఇస్తాయని కానీ, లాభాలకు గ్యారెంటీ అని కానీ. పెట్టుబడులకు పూచీకాని ఎవరూ ఇవ్వరు. అయినప్పటికీ.. ప్రజలు మాత్రం తండోపతండాలుగా క్రిప్టోవైపు మొగ్గు చూశారు.
ఆర్థిక నిపుణులు ఏమన్నారంటేఔ
ఎందుకు ఇలా చేరారంటే.. అధిక మొత్తాలపై ఆశలతోనే. కూర్చుని సంపాయించే మార్గం కాబట్టే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎలా అంటే.. మన రెగ్యులర్ కరెన్సీలో అంతర్జాతీయ స్థాయిలో డాలర్ కు ఎంతటి డిమాండ్ ఉందో క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ కు డిమాండ్ ఉంది. క్రిప్టో కరెన్సీలో రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కంపెనీలు నమ్మిస్తాయి. అయితే ఇదే సమయంలో నష్టాలు కూడా భారీగానే ఉంటాయి. ఈ విషయాన్ని పెట్టుబడిదారులే తెలుసుకోవాలి. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు 24 గంటలూ మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తునే ఉండాలి. దీనిలో ఎక్కడ తేడా కొట్టినా.. నష్టాలు ఖాయం. దీనిని బట్టి.. అడుగులు వేయాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
కేంద్రం నిర్ణయంతో జరిగేదిదే!
క్రిప్టో కరెన్సీ, స్టార్టప్ ఆఫీసుల్లో సుమారు 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకవేళ కేంద్రం గనుక క్రిప్టోపై బ్యాన్ పెడితే ఆఫీసులన్నీ విదేశాలకు వెళిపోతాయి. అప్పుడు వేలాది ఉద్యోగులు రోడ్డున పడడం ఖాయం. వీరిలో కొద్దిమందిని మాత్రమే కంపెనీలు విదేశాలకు తీసుకెళుతాయి. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీని ఎక్కువగా రియల్ ఎస్టేట్, మనీ ల్యాండరింగ్, మానవ అక్రమ రవాణా, ఆయుధాల కొనుగోలు, మాదకద్రవ్యాల రవాణాలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఉపయోగపడుతోందని అర్ధమవుతోంది. దీనిని పరిశీలించిన మోడీ సర్కారు.. క్రిప్టోకు గేట్లు మూసేయాలని నిర్ణయించుకుంది. మరి దీనిలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటో చూడాలి. ఏదేమైనా.. దురాశ దుఃఖానికి చేటంటే.. ఇలానే ఉంటుందేమో!