గ్రీన్‌ కార్డ్ రావాలంటే 12 ఏళ్లు ఆగాల్సిందే!

Update: 2017-07-11 17:30 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి మ‌రో చేదు క‌బురు. అమెరికాలో శాశ్వ‌త నివాసం (గ్రీన్‌ కార్డ్‌) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఇండియ‌న్స్ 12 ఏళ్లు వేచి చూడాల్సిందే. స్కిల్డ్ ఎంప్లాయీ కేట‌గిరీలో ప్ర‌స్తుతం 12 ఏళ్ల వెయిటింగ్ లిస్ట్ ఉన్న‌ట్లు తాజా స‌మాచారం. అంటే 2005లో స్కిల్డ్ ఎంప్లాయీ కేట‌గిరీలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అప్లికేష‌న్లు ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఈ లెక్క‌న ఇప్పుడు అప్లై చేసుకుంటే.. 2029లోగానీ గ్రీన్‌ కార్డ్‌ రాదన్న‌మాట‌. అంటే ప‌న్నెండేళ్ల వ‌న‌వాసం టైపులో మ‌నోళ్ల‌కు నిరీక్ష‌ణ త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

అయితే ఏడాదిలో ఎక్కువ గ్రీన్‌ కార్డ్స్‌లో పొందుతున్న దేశ‌స్తుల జాబితాలో ఇండియ‌న్స్ టాప్‌ లోనే ఉన్నారు. 2015లో 36318 మందికి గ్రీన్‌ కార్డ్స్ వ‌చ్చాయి. ఇక తాజాగా మ‌రో 27798 మంది కూడా శాశ్వ‌త నివాసం హోదాను ద‌క్కించుకున్న‌ట్లు ప్యూ రీసెర్చ్ వెల్ల‌డించింది. 2010-14 మ‌ధ్య ఉద్యోగ సంబంధిత గ్రీన్‌ కార్డ్స్‌లో 36 శాతం అంటే 2,22,000 గ్రీన్‌ కార్డ్స్ హెచ్‌-1బీ వీసాలు ఉన్న‌వారికే జారీ చేశారు. ఓ వ్య‌క్తికి గ్రీన్‌ కార్డ్ వచ్చిందంటే .. అత‌ను లేదా ఆమె శాశ్వ‌తంగా అమెరికాలో నివాసం ఉండొచ్చు.. ఉద్యోగం చేసుకోవ‌చ్చు. గ్రీన్‌ కార్డ్ హోల్డ‌ర్ ఐదేళ్ల త‌ర్వాత అమెరికా పౌర‌స‌త్వం కోసం కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అమెరికా వ్య‌క్తిని పెళ్లాడితే మూడేళ్ల‌లోపు కూడా అప్లై చేసుకునే అవ‌కాశం ఉంది. 25 నుంచి 64 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వాళ్లే ఎక్కువ‌గా గ్రీన్‌ కార్డ్ కోసం అప్లై చేసుకుంటున్న‌ట్లు ప్యూ రీసెర్చ్ తెలిపింది.
Tags:    

Similar News