1947లో భారత్ నుంచి మత ప్రాతిపదికన విడిపోయిన పాకిస్థాన్ అప్పటి నుంచి భారత్‌లోని జమ్ము కశ్మీర్ తదితర ప్రాంతాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు భారత్ చేతిలో తీవ్ర భంగపాటు గురయింది. 1948, 1965, 1971 ఇలా భారత్ తో యుద్ధాలు చేసి చావుదెబ్బలు తిన్నా పాకిస్థాన్ బుద్ధి మారలేదు
మళ్లీ 1999 మేలో పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లోని కార్గిల్ ద్వారా భారత భూ భాగంలోకి అడుగుపెట్టారు. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. కార్గిల్ ను ఆక్రమించుకోవడం ద్వారా లడఖ్, జమ్ముకశ్మీర్ లను విడగొట్టాలని చూశారు. అంతేకాకుండా జీవనదుల ప్రవాహం మొదలయ్యే సియాచిన్ గ్లేసియర్ ను భారత్ నుంచి తప్పించాలని పన్నాగం పన్నారు.
అప్పుడు భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజ్‌పేయి ఉన్నారు. పాక్ సైనికులను, ఉగ్రవాదులను కాటికి పంపాలని ఆయన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం సైనిక చర్యను ప్రారంభించింది. ఇండియన్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత సైన్యం తిరిగి చేజిక్కించ్చుకుంది. మేలో మొదలైన ఆపరేషన్ జూలై 26 వరకు మూడు నెలల పాటు కొనసాగింది.
కార్గిల్ యుద్ధం 1999 మే 3 నుంచి జులై 26 మధ్య జరిగింది. కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో.., నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఇతర ప్రాంతాలలో జరిగింది. దాదాపు 90 రోజుల సుదీర్ఘ యుద్ధంలో భారత్ జయభేరి మ్రోగించింది. కార్గిల్ మొత్తం వైశాల్యం 14,086 చదరపు కిలోమీటర్లు. ఇది శ్రీనగర్ నుండి లేహ్ వైపు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ కార్గిల్ ను చెరపట్టాలని చూసిన పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కిన భారత ఆర్మీ పులులు సంహరించాయి. మిగిలినవారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పాకిస్థాన్ కు పారిపోయారు. భారత్ సైనికులు 500 మందికిపైగా అమరులయ్యారు. అలాగే 4000 మంది పాక్ సైనికులను, ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టింది.
ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం ధైర్యసాహసాలకు, వారి పరాక్రమాలకు నిదర్శనంగా నిలిచిన కార్గిల్ యుద్ధం జరిగి జూలై 26కి 23 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి దీన్ని విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుని.. వారి అసమాన పరాక్రమాలకు సెల్యూట్ కొడుతున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. 1999 జూలై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని భారతీయులు అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం జూలై 26 కార్గిల్ విజయోత్సవాన్ని విజయ్ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.