సంస్థలోని ఓ ఉద్యోగి కి కోవిడ్ వైరస్ వ్యాపించడం తో ప్రముఖ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్నే ఖాళీ చేయించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మిగతా ఉద్యోగులకు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. ఓ వారం పాటు ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయాలని కర్నాటక ప్రభుత్వం ఐటీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే భవనం చేసిన విషయాన్ని ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. 1990 నుంచి కొనసాగుతున్న భవనాన్ని తాజాగా ఖాళీ చేయడంతో కరోనా ఎంత ప్రభావం చూపిందో తెలుస్తోంది. బెంగళూరులోని ఐఐపీఎం భవనాన్ని ఖాళీ చేసినట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సంస్థ బెంగళూర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే మెయిల్ ఈ విధంగా పంపించాడు.. "సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వ్యాపించిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఐఐటీఎం భవనం ఖాళీ చేస్తున్నాం. మన ఉద్యోగుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీరు గుర్తించాలి. కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీరేమీ ఆందోళన చెందవద్దు. కరోనా వ్యాప్తి గురించి ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని నమ్మకండి.. ప్రచారం చేయకండి. మీరు బాధ్యతాయుతంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా." అని మెయిల్ చేశారు.
ఇక బెంగళూరులోని ఐటీ కంపెనీలకు కర్నాటక ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఓ వారం పాటు ఉద్యోగులందరూ ఇంటి నుంచే విధులు (వర్క్ ఫ్రమ్ హోం) నిర్వహించాలని సూచించింది.