మార్కెట్‌లో వెయ్యి ఒక్క రూపాయి పదిహేను పైసలు పలుకుతున్న షేరును ఐదంటే.. ఐదురూపాయిలకే ఇవ్వటం సాధ్యమేనా? అది కూడా 1,24,061షేర్లు. అది కూడా ఇన్ఫోసిస్ లాంటి పేరు మోసిన షేర్లు..!
అదెలా కుదురుతుందని కాస్త ఆవేశం ఉన్న వారు చెప్పేస్తారు కానీ.. అది సాధ్యమయ్యేలా చేసింది కంపెనీ. రాజు తలుచుకోవాలే కానీ దెబ్బలకు కొదవ ఉంటుందా? అన్న దాన్ని కాస్త మార్చి.. రాజు తలుచుకుంటే వరాలకు కొదవ ఉంటుందా? అన్న చందంగా తాజాగా కంపెనీ వ్యవహరించింది. అలా అని ఇదేమీ నిబంధనల ఉల్లంఘన కాదు. పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉండే ఆర్‌ఎస్‌యూల కింద కంపెనీ బోర్డు మీటింగ్లఓ ఇన్ఫోసిస్ సీఈవో కమ్ ఎండీగా వ్యవహరిస్తున్న విశాల్ సిక్కాకు కంపెనీ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మంగళవారం స్టాక్ మార్కెట్‌లో ఇన్ఫోసిస్ ధర ఒక్కొక్కటి రూ.1001.15గా పలుకుతోంది. దీన్ని ముఖ విలువ రూ.5 మాత్రమే. మార్కెట్ విలువను వదిలేసి.. ముఖ విలువతో కూడిన 1,24,061 షేర్లను కంపెనీ శిక్కాకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దీంతో.. ఆయన ఖాతాలోకి రూ.12.34కోట్ల విలువైన షేర్లు కేవలం రూ.6,20,305 చెల్లించి సొంతం చేసుకున్న పరిస్థితి. ఈ విషయంపై ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి సమాచారం ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. అలా.. రూ.1001 విలువ చేసే ఒక్కో షేరును కేవలం రూ.5లకే సొంతం చేసుకునే ఛాన్స్ సిక్కాకు లభించింది.