తెలంగాణ ఎన్నికల రణరంగానికి ఇంకా 32 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంకా మహా కూటమి పంచాయితీ తెగలేదు. దీంతో ఇటీవలే కేటీఆర్ ఓ కొత్త వ్యాఖ్యానం చేశారు. అది బాగా పాపులర్ అవుతోంది. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు... మేము స్వీట్లు పంచుకుంటాం... అని. అదే నిజమయ్యేలా ఉంది పరిస్థితి.
మహాకూటమికి కోదండరాం అవసరం ఎంతుందో స్పష్టంగా తెలుసు. ఆయన్న వదులుకోడానికి ఇష్టపడటం లేదు. అలాగని అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొగుడి నుంచి ప్రేమ తప్ప ఖర్చులకు డబ్బులు రావడం లేదన్నట్లుంది కోదండరాం పరిస్థితి. మర్యాదకు మాత్రం ఢిల్లీ స్థాయిలో కూడా తక్కువ లేదు. కానీ సీట్ల విషయంలో గల్లీ స్థాయి ప్రాధాన్యం. ఇక టీడీపీ కూడా ఇంకా సీట్లు కావాలని పట్టుబడుతుండగా - సీపీఐ ... ఐదు ఇవ్వమని ఖరాఖండిగా చెబుతోంది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారు. దీంతో టీఆర్ ఎస్ తో పోలిస్తే మహాకూటమి ప్రచారంలో చాలా వెనుక పడి ఉంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఇప్పటికే ప్రచారం పూర్తి చేసుకుంది. కానీ మహా కూటమి ఇంకా మొదలే పెట్టలేదు. దీంతో మహాకూటమి అభ్యర్థులు బాగా వెనుకపడిపోతున్నారు.
కూటమి పొత్తుల్లో అసలు నియోజకవర్గం సీటు మా పార్టీకే దక్కుతుందా? లేదా? అన్న అనుమానం కనీసం 50 నియోజకవర్గాల్లో ఉండటంతో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి రూపాయి విదల్చడం లేదు. దీంతో ప్రచారం ముందు పడటం లేదు. ప్రజలు టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఐదేళ్లూ చేసిన అభివృద్ధి కంటే కూడా అభ్యర్థులు చేసే ప్రచారమే జనాలకు బాగా ఎక్కుతుంది. అది ఎదుటి వారిని దెబ్బ కొట్టడం అయినా సొంత డబ్బా కొట్టుకోవడం అయినా... ఈ రెండు పనులు టీఆర్ ఎస్ అభ్యర్థులతో పాటు కేటీఆర్ భారీ స్థాయిలో శరవేగంగా చేస్తున్నారు. మహాకూటమి పార్టీల కేడర్ టీఆర్ ఎస్ స్పీడు చూసి వణుకుతోంది. వీళ్లను ఢీకొని గెలవగలమా? అన్న సందేహాలు కేడర్ లో మొదలయ్యేటంత ఆలస్యం అయ్యింది. దీంతో కేటీఆర్ చెప్పినట్లే స్వీట్లు పంచుకుంటారేమో!