తెలంగాణలో జూన్ 1వ తేదీ నుండి ఇంటర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని ముందు ప్రకటించారు. అయితే , సెకండ్ వేవ్ విజృంభణ ఇంకా కొనసాగుతోన్న సందర్భంగా..జూన్ 1వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ను సాయంత్రం లోపు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రతి ఏడాది కూడా జూన్ 1 నుంచే ఇంటర్ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్ 1 నుంచే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించాలని ఈ మద్యే ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ ను మరో పది రోజులు పెంచిన సంగతి తెలిసిందే. జూన్ 9 వరకు కరోనా లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పై మళ్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీన్ని బట్టి చూస్తే .. కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా తొలగించే వరకు ఇంటర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యేది కష్టమే అని చెప్పొచ్చు.
ఇకపోతే , సీబీఎస్ ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలా లేదా రద్దు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్ ఈ, సీఐఎస్ సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలపై సమగ్ర వివరాలు కావాలని మేం కోరాలనుకోవడం లేదు. కానీ, గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదని పిటిషనర్ భావిస్తున్నారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఒకవేళ గతేడాది విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక.. అందుకు స్పష్టమైన కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది అని కోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. పరీక్షలపై ప్రభుత్వం రెండో రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల గురువారం వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఆ రోజున తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం అని చెప్పారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.