మనం నిరంతరం నిఘాలోనే ఉన్నాం.. మనం ఏ లొకేషన్లో ఉన్నాం.. ఆన్లైన్లో ఏం బ్రౌజ్చేస్తున్నాం.. ఏం చూస్తున్నాం.. ఇలా మన ప్రతి కదలికలను కొన్ని కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అది కూడా మన ఈమెయిల్స్ ద్వారానే అని తేలిపోయింది. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలే.. అయితే ఆన్లైన్లో చేసే బ్రౌజింగ్ ఎవరికీ తెలియదని.. ప్రైవసీగా ఉంటుందని అనుకుంటాం. కానీ అదంతా తూచ్. మనపైన కొన్ని కంపెనీలు, కొందరు సైబర్ నేరగాళ్లు నిరంతరం నిఘా పెట్టి ఉంటారు.
అయితే అదంతా మన ఈ మెయిల్స్ ద్వారానే అని ఇప్పుడు తేలిపోయింది. స్పై పిక్సెల్స్ అని పిలిచే కొన్ని ట్రాకర్ల ద్వారా ఇమెయిల్ అకౌంట్లలో మన డేటాను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఈ మెయిల్ లాగిన్ అయ్యారు? ఏమి ఓపెన్ చేశారు? ఏ డివైజ్ లో చూశారు? ఏ లొకేషన్ లో ఉన్నారు ఇలా ప్రతిదీ ట్రాక్ చేస్తున్నారు. చాలా కంపెనీలు ఈ ట్రిక్ ద్వారానే మనపై నిఘా పెడుతున్నాయని సమాచారం. అయితే కంపెనీలు అలా మనమీద నిఘా పెట్టాయన్న విషయం కూడా మనం పసిగట్టలేం..
ప్రస్తుతం చాలామందికి ఈ మెయిల్స్‌కు స్పై ఫిక్సల్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ మెసేజ్ లు కూడా ఇమేజ్ ఫైళ్ల రూపంలో లేదా జిఫ్ ఫైల్ మాదిరిగా ఉంటాయి. ఇవి మన కంటికి కనిపించవు. హైడ్ మోడ్‌లో ఉంటాయి. దీంతో మనం కనుక్కోలేం. కానీ వీటి ద్వారానే కొన్ని కంపెనీలు మన డాటాను చోరీచేస్తున్నాయి. వీటి ద్వారా మన ఐపీ అడ్రస్‌ను కనుక్కొని మన బ్రౌజింగ్ డాటా మొత్తం కొట్టేస్తున్నాయి కొన్ని కంపెనీలు. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం.