ఐపీఎల్ లో ఫుల్ ఎంటర్ టైయిన్మెంట్ ఇవ్వడంలో కిరన్ పోలార్డ్ ముందుంటాడు. వెస్టిండీస్‌కు చెందిన పోలార్డ్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. పోలార్డ్ క్రీజ్ లో ఉన్నాడంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు పండగే. అతడు కొట్టే సిక్సర్లు, బౌండరీలతో ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. ఐపీఎల్ లో అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో ఆడుతున్న బ్యాట్స్మెన్లలో పోలార్డ్ కూడా ఒకడు.
క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, కిరన్ పోలార్డ్ క్రీజ్ లో లాంటి బ్యాట్స్మెన్లు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది. ప్రత్యర్థులకు చమటలు పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పెద్దగా రాణించడం లేదు. ఓపెనర్లు బిగ్ నాక్ ఆడకపోవడం.. మిడిల్ ఆర్డర్ కూడా కుప్ప కూలుతుండటంతో ముంబై జట్టు వెనకబడిపోయింది.
అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ముంబై సునాయసంగా గెలుపొందింది. డికాక్, కృనాల్ పాండ్యా రాణించడంతో ఆ జట్టు ఈజీగా విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. దీంతో 18.3 ఓవర్లలో ముంబై ఈ లక్ష్యాన్ని చేధించింది.
ఇదిలా ఉంటే నిన్నటి మ్యాచ్‌లో ఓ తమాషా జరిగింది. 18 వ ఓవర్లలో క్రిస్ మోరిస్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పుడు క్రీజులో పోలార్డ్ ఉన్నాడు. మోరిస్ వేసిన ఓ బంతి పొలార్డ్ హెల్మెట్‌ను తాకి బౌండరీకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పోలార్డ్ బ్యాట్ మాత్రమే కాదు. అతడి హెల్మెట్ కూడా బౌండరీలు కొడుతది అంటూ ముంబై ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ట్విట్టర్, ఫేస్బుక్ లో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది.ముంబై ఫ్యాన్స్ మీమ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు.
హెల్మెట్‌కు తాకిన బంతి బౌండరీ వెళ్లడంతో పోలార్డ్ సైతం నవ్వుకున్నాడు.