ఐపీఎల్ లో మరో రెండు ప్రాంఛైజీలు రానున్న వేళ.. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు సంబంధించి ఒక్కో జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకునే అవకాశాన్ని కల్పించింది. అంటే.. మొత్తం ఎనిమిది జట్లు కలిసి 32 మంది ఆటగాళ్లను తమతో ఉంచుకునే వీలుంది. అయితే.. ఈ 32 మందిలో 27 మందిని ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకోగా.. మరో ఐదుగురు మాత్రం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీల నుంచి వైదొలిగారు. అలాంటి ఆ ఐదుగురిలో కొందరు తమకు తాము బయటకు రాగా.. మరికొందరిని ఫ్రాంచైజీలే బయటకు పంపాయి.
ఐసీసీ పాలకమండలి ఇచ్చిన డెడ్ లైన్ కు ఒక రోజు ముందే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గడువు బుధవారం ముగుస్తుండగా.. మంగళవారానికే చెన్నై.. ముంబయి.. ఢిల్లీ.. కోల్ కతాలు గరిష్ఠ కోటాను ఉపయోగించుకుంటూ నలుగురుచొప్పున ఆటగాళ్లను అట్టి పెట్టుకుంటే.. బెంగళూరు.. రాజస్థాన్ తలో ముగ్గురిని తమతో ఉంచేసుకుంది. పంజాబ్ మాత్రం ఇద్దరిని మాత్రమే తమతో ఉంచేసుకోవటం గమనార్హం.
ఫ్రాంచైజీలకు దూరమైన వారు ఎవరెవరన్నది చూస్తే.. అందరి అంచనాలకు ఏ మాత్రం తేడా రాకుండా సన్ రైజర్స్ తో డేవిడ్ వార్నర్ వీడిపోయాడు. ఐపీఎల్ లో అడుగు పెట్టిన నాటి నుంచి హైదరాబాద్ జట్టుతో ఉన్న అతను.. ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. అదే సమయంలో కీలకమైన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ ఫ్రాంఛైజీతోనే ఉంటాడని భావిస్తే.. అతనూ దూరమయ్యాడు. వార్నర్ తో పాటు హైదరాబాద్ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించే బెయిర్ స్టోను సైతం సన్ రైజర్స్ వదులుకోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. విలయమ్స్ ను అట్టిపెట్టుకోవటం అందరూ అంచనా వేసిందే అయినా.. సమద్.. ఉమ్రాన్ మాలిక్ లను జట్టులో కొనసాగేలా తీసుకున్న నిర్ణయం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చెన్నై జట్టు ధోనితో పాటు జడేజాను.. రుతురాజ్ గైక్వాడ్.. మొయిన్ అలీలను అట్టిపెట్టుకుంది. అయితే.. ఆ జట్టు తన తొలి ప్రయారిటీ ఇచ్చిన ఆటగాడిగా ధోనిని కాకుండా జడేజాను ఎంచుకుంది. అతడికే గరిష్ఠంగా రూ.16 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ధోనీ రూ.12 కోట్లు అందుకోనున్నాడు. మొయిన్.. రుతురాజ్ లకు వరుసగా రూ.6కోట్లు.. డుప్లెసిస్.. రైనా.. రాయుడు లాంటి స్టార్లను జట్టు వదులుకుంది.
కోల్ కతా విషయానికి వస్తే తమ జట్టు కెప్టెన్ మోర్గాన్ తో పాటు మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీలకు గుడ్ బై చెప్పేసింది. రసెల్.. వరుణ్చక్రవర్తి.. వెంకటేశ్ అయ్యర్.. నరైన్ లను మాత్రం అట్టి పెట్టుకుంది.
కమిన్స్ తో పాటు నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ శుభ్ మన్ గిల్ నూ వదులుకుంది.ఢిల్లీ జట్టు విషయానికి వస్తే.. పంత్.. అక్షర్ పటేల్.. ప్రథ్వీ.. నార్జల్ ను తీసుకోగా.. శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు. నిజానికి శ్రేయస్ కెప్టెన్ అయ్యాకే ఢిల్లీ ఒక గాడిన పడింది. అయినప్పటికీ అతన్ని వదులుకున్న జట్టు.. గత సీజన్ మొదట్లో గాయాల బారిన పడి జట్టుకు దూరమైన పంత్ కు తాత్కాలికంగా పగ్గాల్ని అప్పజెప్పింది. తనకు కెప్టెన్సీ ఇవ్వని కారణంగానే శ్రేయస్ జట్టును వదిలి పెట్టాలని భావించినట్లు చెబుతున్నారు. ధావన్.. రబాడ.. ఆశ్విన్ లనూ వదులుకుంది.
ముంబయి జట్టు విషయానికి వస్తే.. చాలా ఏళ్లుగా జట్టులో కొనసాగుతుున్న హార్దిక్ పాండ్య.. క్రనాల్ పాండ్యా.. బౌల్ట్ లకు మొండి చేయి చూపగా.. రోహిత్.. బుమ్రా.. పొలార్డ్.. సూర్యకుమార్ లను ఎంపిక చేసుకుంది.
పంజాబ్ జట్టు విషయానికి వస్తే.. రాహుల్.. షమిలు దూరమయ్యారు. మయాంక్ ను రూ.14 కోట్లతో ఉంచుకోగా.. అన్ క్యాప్డ్ ఆటగాడైన అర్ష్ దీప్ ను రూ.4కోట్లు ఇచ్చి తమతో ఉంచుకుంది.
ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారు? అన్న విషయాన్ని చూస్తే..
చెన్నై
- జడేజా
- ధోని
- మొయిన్ అలీ
- రుతురాజ్
ముంబయి
- రోహిత్
- బుమ్రా
- సూర్యకుమార్
- పొలార్డ్
ఢిల్లీ
- పంత్
- అక్షర్ పటేల్
- ప్రథ్వీ షా
- నార్జ్
కోల్ కతా
- రసెల్
- వరుణ్ చక్రవర్తి
- వెంకటేశ్ అయ్యర్
- నరైన్
బెంగళూరు
- కోహ్లీ
- మ్యాక్స్ వెల్
- సిరాజ్
సన్ రైజర్స్
- విలియమ్స్
- అబ్దుల్ సమద్
- ఉమ్రాన్ మాలిక్
రాజస్థాన్
- సంజు శాంసన్
- బట్లర్
- యశస్వి
పంజాబ్
- మయాంక్
- అర్ష్ దీప్