ఇరాన్ దొంగతనానికి ప్రయత్నించిందా ?

Update: 2022-09-01 06:50 GMT
వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో రెండు రోజుల క్రితం గస్తీ తిరుగుతున్న అమెరికా సముద్ర ద్రోన్ ను ఇరాన్ గస్తీదళం దొంగతనం చేసేందుకు ప్రయత్నించింది.

అయితే అప్రమత్తమైన అమెరికా దళాలు ఎదురు తిరగడంతో పాటు ఇరాన్ పై బాగా ఒత్తిడి పెంచటంతో చేసేదిలేక అమెరికా ద్రోన్ ను వదిలేసి వెళ్ళిపోయిందట. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అమెరికా సముద్ర ద్రోన్ అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నాయి.

అదే సమయంలో ఇరాన్ చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ సహాయ నౌక షహిద్ బజిర్ అక్కడకు చేరుకున్నది. అమెరికా సముద్ర ద్రోన్ ను రివల్యూషనరీ గార్డ్స్ ఉన్న షిప్ నెట్టుకుంటు ముందుకు తీసుకెళ్ళిపోయింది.

అయితే సముద్ర ద్రోన్ కు సమీపంలోనే గస్తీ కాస్తున్న అమెరికన్  థండర్ బోల్ట్ నేవీ స్పందించింది. తమ ద్రోన్ ను ఇరాన్ గార్డ్స్ తీసుకెళుతున్న విషయం అర్ధమైపోయింది. వెంటనే రివల్యూషనరీ గార్డ్స్ షిప్ దగ్గరకు థండర్ బోల్ట్ చేరుకున్నది. అయితే అప్పటికే అమెరికా ద్రోన్ ను ఇరాన్ షిప్పుకు కట్టేసుండటాన్ని థండర్ బోల్డ్ అధికారులు గమనించారు.

ఇదే విషయాన్ని అమెరికా నేవీ అధికారులు ఇరాన్ అధికారులను ప్రశ్నించారు. అయితే ఇరాన్ వైపు నుండి ఎలాంటి సమాధానం చెప్పకుండానే ముందుకు వెళిపోతున్నారు. దాంతో లాభం లేదనుకుని అమెరికా గస్తీ నౌక సముద్ర ద్రోన్ సమీపంలోకి వెళ్ళింది. మరోవైపు బహరైన్ వైపునుండి సీహాక్ అనే యుద్ధ హెలికాప్టర్ కూడా ఇరాన్ నౌక వైపు బయలుదేరింది.

అంటే ఇరాన్ నౌకను ఒకవైపు అమెరికన్ నేవీ వార్ షిప్, మరోవైపు గస్తీ నౌక, ఇంకోవైపు సీహక్ అనే వార్ హెలికాప్టర్ చుట్టుముట్టాయి. దాంతో చేసేదిలేక అమెరికా సముద్ర ద్రోన్ ను ఇరాన్ నేవీ అధికారులు వడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అసలు అమెరికా సముద్ర ద్రోన్ ను దొంగతనం చేయాలని ఇరాన్ కు ఎలా అనిపించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News