చైనాలో వెలుగులోకి వచ్చి, ఆ తరువాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిన ఈ కంటికి కనిపించని మహమ్మారి ప్రత్యక్షంగా ఎంతోమంది ప్రాణాలని తీసుకుంటుంది. అయితే , ఈ వైరస్ సోకుతుంది ..లేకపోతే సోకుతుందేమో అన్న భయంతో ముందుగానే ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. తాజాగా తన మూలంగా కుటుంబానికి ఈ వైరస్ సోకుతుందేమో అన్న భయంతో ఢిల్లీలో ఒక సీనియర్ IRS అధికారి ఆత్మహత్యకు పాల్పడిన వైనం విషాదాన్ని నింపింది.
ఈ విషాధ సంఘటన న్యూఢిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకున్నది. వైరస్ భయంతో 56 ఏండ్ల ఐఆర్ ఎస్ అధికారి తన కారులో యాసిడ్ లాంటి పదార్థం తాగి ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారులో విగత జీవిగా పడి ఉన్న అతన్ని గుర్తించిన పోలీసులు సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ప్రకటించారు.
తనకు కరోనా సోకిందనే భయంతో, తన వల్ల కుటుంబ సభ్యులకు ఈ ప్రాణాంతక వైరస్ సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్ నోట్ లో తెలిపారు. కాగా ఆ అధికారికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. యాసిడ్ లాంటి పదార్థం తాగడంతోనే ఐఆర్ ఎస్ అధికారి మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో అతడు కలత చెందాడని, తన వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.