అభ్యర్ధులను బీజేపీ రెచ్చగొడుతోందా?

Update: 2022-06-20 06:46 GMT
అసలే సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన ఒక పథకం గురించి బీజేపీ సీనియర్ నేతలు చాలా చీపుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల యువతలో మరింత ఆగ్రహావేశాలు పెరిగిపోయే ప్రమాదముందని తెలిసినా ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఇదంతా ఏ విషయంలో అంటే కేంద్రం ఈమధ్యనే ప్రకటించి అగ్నిపథ్ పథకం ప్రకంపనలు ఏ స్ధాయిలో ఉన్నాయో అందరు చూస్తున్నదే. సైన్యంలో చేరాలని అనుకునేవారికి 4 ఏళ్ళ షార్ సర్వీసు పద్దతిలో నియామకాలు చేసేందుకు అగ్నిపథ్ పథకాన్ని దీసుకొచ్చింది.

ఈ పథకం అమలుపై ఒకవేపు దేశంలోని యువత మండిపోతుంటే బీజేపీ సీనియర్ నేతలు అగ్నికి ఆజ్యంపోసినట్లు మాట్లాడుతున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అగ్నిపథ్ పథకంలో రిటైర్ అయిన వారిని దేశంలోని బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటి గార్డులుగా నియమించుకుంటామన్నారు. తమపార్టీకి సెక్యూరిటి గార్డుల అవసరముందని ఈ నియామకాల్లో అగ్నివీరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చేసిన ప్రకటన ఇపుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.
 
పథకం విషయంలో దేశంలోని 13 రాష్ట్రాల్లో యువత తీవ్రంగా మండిపోతోంది. ఐదురాష్ట్రాల్లో రైల్వస్టేషన్లను, ఆస్తులను కాల్చేసి ధ్వంసం చేసేశారు. వీళ్ళదెబ్బకు దేశవ్యాప్తంగా వందలాది రైళ్ళను రద్దుచేయటమో లేకపోతే రూట్లు మార్చటమో చేసింది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ విషయంలో ఏమిచేయాలో అర్ధంకాక కేంద్రమంత్రులే అవస్తలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అధికారపార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.
 
అగ్నీవీరులకు నాలుగేళ్ళ సర్వీసు తర్వాత గౌరప్రదమైన జీవితాన్ని పథకం హామీఇస్తుందని కేంద్రమంత్రులు చెబుతున్నారు. కేంద్రం చెబుతున్న మాటలు ఆచరణలో ఏమాత్రం అమల్లోకి వస్తుందనే విషయం తేలాలంటే మొదటిబ్యాచ్ తమ సర్వీసును పూర్తిచేసుకోవాలి.

నాలుగేళ్ళ సర్వీసు పూర్తిచేసుకుని బయటకొచ్చిన మొదటిబ్యాచ్ కు సమాజంలో ఏమాత్రం గౌరవం దక్కింది ? పథకం హామీలు అమలైందా లేదా తేలాలంటే కాస్త సమయం అవసరం. ప్రతిపక్షాలంటే కేంద్రాన్ని ఇబ్బంది పెట్టడానికి ఉద్యమకారులకు మద్దతిస్తాయి. మరి అధికారపార్టీ నేతలకు ఏమైంది ? మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి కదా. వీళ్ళ అనాలోచిత ప్రకటనవల్ల యువత మరింత రెచ్చిపోతే బాధ్యత ఎవరిది ?
Tags:    

Similar News