సెంటిమెంట్‌కు భ‌య‌ప‌డుతోన్న చంద్ర‌బాబు ?

Update: 2021-06-18 03:30 GMT
రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉండే ప్రాధాన్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా మంది నేతలు సెంటిమెంట్ల‌నే న‌మ్ముకుని ప్ర‌తి అడుగు వేస్తుంటారు. కొంద‌రు నేత‌లు కొన్ని సెంటిమెంట్ల‌కు బ‌లి అవుతుంటారు.. కొంద‌రు భ‌య‌ప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం చంద్ర‌బాబును సైతం ఇప్పుడు ఓ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంద‌ట‌. ఎందుకంటే వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోవ‌డం అనేది ఆయ‌న‌కు పెద్ద బ్యాడ్ సెంటిమెంట్‌. 1994లో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని సీఎం అయిన ఆయ‌న ఆ త‌ర్వాత 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే తొలిసారి ఎన్నిక‌ల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయారు.

ఒక‌సారి ఎన్నిక‌ల్లో గెలిచి.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయిన ఆయ‌న ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో విజ‌యం సాధించి... ఏపీకి తొలి ముఖ్య‌మంత్రిగా రికార్డుల‌కు ఎక్కారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు గెలిచి ఉంటే.. ఆయ‌న‌కు రికార్డు ఉండేది. అయితే 1999లో తొలిసారి గెలిచి ఎలా అయితే ఐదేళ్లు మాత్ర‌మే నాటి స‌మైక్యాంధ్ర‌కు సీఎంగా ఉన్నారో... ఇప్పుడు ఏపీలో కూడా ఐదేళ్ల పాటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న‌ను ఇప్పుడు వ‌రుస‌గా ఓ సారి గెలిచి.. రెండు సార్లు ఓడుతోన్న సెంటిమెంట్ భ‌య‌పెడుతోంద‌ట‌.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ‌య‌స్సు పై బ‌డిపోయింది. ఆయ‌న గ‌తంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు లోకేష్ సామ‌ర్థ్యంపై అనేకానేక సందేహాలు నెల‌కొన్నాయి. దీంతో చంద్ర‌బాబులో ఎంత‌లేద‌న్నా... పైకి ఎంత డాంబికంగా ఉన్నా కూడా 2024 భ‌యం ఉంద‌న్న‌ది నిజం. 2004లో వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ చేతిలో ఓడిన చంద్ర‌బాబు.. 2009లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎన్ని కూట‌ములు క‌ట్టినా ఉప‌యోగం లేదు. వ‌రుస‌గా రెండోసారి అధికారానికి దూర‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఏపీలో కూడా పార్టీ ప‌రిస్థితి ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు.

దీంతో ఈ ఐదేళ్లు కాకుండా మ‌రో ఐదేళ్లు ప్రతిప‌క్షంలో ఉండాల్సిందేనా ? అన్న ఆందోళ‌న ఆయ‌న్ను వెంటాడుతోంది. మ‌రో ఐదేళ్లు ప్ర‌తిప‌క్షం అంటే చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కెరీర్ ముగిసిన‌ట్టే..! ఇటు పార్టీ నేత‌ల్లోనూ ఇదే భ‌యం వెంటాడుతోంది. విచిత్రం ఏంటంటే మ‌ళ్లీ చంద్ర‌బాబు 2024లో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌న‌సేన‌, బీజేపీతో జ‌ట్టు క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌తోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.
Tags:    

Similar News