బెజ‌వాడ‌లో చంద్ర‌బాబు ఇల్లు కాస్ల్టీనా?

Update: 2021-07-05 07:45 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మ‌రో వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో సొంత‌గా ఇల్లులేదు. కానీ, రాజ‌ధాని విష‌యంలో మాత్రం గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ నేత‌లు.. చంద్ర‌బాబును ఇదే విష‌యంపై ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి అని పేర్కొంటున్న చంద్ర‌బాబు.. ఇక్క‌డ ఎందుకు ఇల్లు క‌ట్టుకోలేద‌ని.. ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు హైద‌రాబాద్‌లో ఇల్లు ఉంది.

ఇటీవ‌లే ఆయ‌న దీనిని భారీగా విస్త‌రించారు కూడా. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అధికారంలోకి రాగానే కొన్నాళ్లు హైద‌రాబాద్ కేంద్రంగా చంద్ర‌బాబు పాల‌న సాగించారు. త‌ర్వాత ఓటుకు నోటు కేసు వెలుగు లోకి రావ‌డం తో హుటాహుటిన త‌న మ‌కాంను రాజ‌ధాని ప్రాంతానికి మార్చుకున్నారు. అప్ప‌ట్లో బ‌స్సులోనే ఆయ‌న కొన్ని రోజులు మ‌కాం వేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. దీనికి టీడీపీ అనుకూల మీడియా భారీ ఎత్తున ప్రచారం కూడా చేసింది. ఇక‌, కొన్నాళ్ల‌కు.. ఈ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్‌ను రెంట్ కు తీసుకుని అక్క‌డే ఉన్నారు.

ఇక‌, ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లతో మ‌మేకం అయ్యేందుకు అంటూ.. ప్ర‌జావేదికను నిర్మించారు. దీనికి సుమారు రూ.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోవ‌డం, త‌ర్వాత‌.. క‌రోనా రావ‌డంతో ఇక‌, చంద్ర‌బాబు హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మై.. జూమ్ యాప్ ద్వారా.. వాయిస్ వినిస్తున్నారు. ఇదిలావుంటే.. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో అమ‌రావ‌తి ఉద్య‌మం తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉండ‌డంతో దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు ఎన్నిక‌లకు మూడేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కొత్త ఐడియాతో చంద్ర‌బాబు ముందుకు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. రాజ‌కీయ రాజ‌ధానిగా పేరున్న విజ‌య‌వాడ‌లో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. అత్యంత అధునాతన హంగుల‌తో నిర్మించే ఈ గృహానికి సుమారు వంద కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంద‌ని.. అయినా త‌గ్గేది లేద‌ని.. బాబు నిర్ణ‌యించుకున్నార‌ట‌. త‌ద్వారా.. గుంటూరు, కృష్నాజిల్లాల్లో సొంత ఇల్లు ఏర్ప‌డి.. రాజ‌ధాని ఇదే అని చెప్ప‌డానికి నిశ్చ‌యించుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేష్‌ను.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయించి.. గెలిపించుకోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News