మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదిన వైసీపీలో ఆయన చేరికకు ముహూర్తం ఖరారైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
వైసీపీ అధినేత.. సీఎం జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది.
సీఎం జగన్ సన్నిహితుడితో జరిగిన చర్చలు ఫలించాయని ఈ మేరకు గంటా చేరికకు అంతా ఓకే చెప్పినట్టు తెలిసింది.
టీడీపీ మాజీ మంత్రి గంటా టీడీపీ హయాంలో సైకిళ్ల కుంభకోణంలో అరెస్ట్ అవుతాడని ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిలు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీంతో గంటాకు ఇక వైసీపీలోకి ఎంట్రీ ఉండదని భావించారు. అనూహ్యంగానే ఆయన వైసీపీలో చేరుతుండడం విశేషంగా మారింది. దీనివెనుక ఎవరున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.