ఎవరు అవునన్నా.. కాదన్నా పాల్ లాంటి రాజకీయ నేత మరే రాష్ట్రంలో కనిపించరు. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారటమే కాదు.. తన నోటి మాటలతో నిత్యం మీడియాలో పెద్ద ఎత్తున కవర్ అవుతున్న ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థులపై ఎంతలా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఒక ఎత్తు అయితే.. వెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఆయనకు చెల్లు అని చెప్పక తప్పదు. తాజాగా పాల్ చేసిన వ్యాఖ్యలు ఇదే తీరులో ఉంది. జనసేన అధినేత పవన్ తనకు కులంతో సంబంధం లేదని చెప్పటమే కాదు.. తాజాగా తాను దాఖలు చేసిన నామినేషన్లోనూ కులం ఎదుట ఖాళీ పెట్టేయటం తెలిసిందే.
పవన్ తనను తాను కాపుగా చెప్పుకోకున్నా.. కాపులు ఆయన్ను తమ సామాజిక వర్గ నాయకుడిగా భావిస్తుంటారు. ఆయన్ను అమితంగా ఆరాధిస్తుంటారు. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వారు.. తమ వర్గానికి చెందిన అధినేతల్ని.. నేతల్ని ఏ రీతిలో అయితే నెత్తిన పెట్టుకుంటారో.. పవన్ ను కాపులు అలానే ఫీల్ అవుతుంటారు. అయితే.. కులాలతో రాజకీయాలు చేయటం పవన్ కు అలవాటు ఉండదు. కాపులు మాత్రమే పవన్ ను అభిమానిస్తారా? అంటే.. కాదనే చెప్పాలి. పవన్ ను అభిమానించే వారు అన్ని కులాల్లో ఉన్నప్పటికీ.. కాపుల్లో అత్యధికులు పవన్ మీద అభిమానాన్ని ప్రదర్శిస్తారన్న విషయాన్ని కొట్టి పారేయలేం.
మరి.. అలాంటి కాపుల ఓట్లు కావాలంటే పవన్ ను తిడితే వారు ఓట్లు వేస్తారా? అన్నది ప్రశ్న. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడటమే కాదు.. గుండు గీయించుకున్న పవన్ కల్యాణ్ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్ కావాలో కాపులు ఆలోచించాలంటూ ఏ మాట అయితే అనకూడదో ఆ మాటను అనేశారు. పవన్ కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని ఆయన తేల్చేశారు.
గుండు గతయించుకున్న పవన్ అంటూ పాల్ వ్యాఖ్యల్లో నిజం ఎంతన్నది ప్రశ్నార్థకమే. అయినా.. నాలుగు ఓట్లు కోసం ప్రపంచాన్ని శాసించే పాల్.. పవన్ లాంటి వ్యక్తి మీద అంత దారుణ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? అయినా.. పాల్ అమాయకత్వం కాకుంటే.. పవన్ ను ఉద్దేశించి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే.. ఓట్లు పడతాయా? అందులోకి కాపుల మనసుల్ని కెలికే రీతిలో చేసే వ్యాఖ్యలతో పాల్ కు ఓట్లు తర్వాత తిట్లు మాత్రం ఫుల్ గా పడతాయన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.