వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నారా లోకేష్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలోనే పోటీ చేసి గెలుపును చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తానని లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ ఇక్కడే పోటీచేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే పెద్దల మాట ప్రకారమే లోకేష్ మంగళగిరిలో పోటీకి రెడీ అవుతున్నారు.
అయితే అనూహ్యంగా భీమిలిలో నేతలు కూడా తమ దగ్గర నుండి పోటీచేయమని లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారట. పోయిన ఎన్నికల్లో భీమిలి నుండి సబ్బంహరి పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో హరి ఈ మధ్యనే చనిపోయారు. ప్రస్తుతానికి ఇక్కడ గట్టి లీడర్ లేరనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లోనే లోకేష్ భీమిలీ నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో చివరి నిముషంలో మంగళగిరి నియోజకవర్గమే సేఫ్ అనుకున్నారు.
సరే గతంలో ఏదో జరిగిపోయింది కాబట్టి దాన్ని వదిలేసి వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుండి పోటీచేయాల్సిందే అని లీడర్లంతా ఒత్తిడి పెడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరి లోకేష్ ఆలోచనలు ఎలాగుంటున్నదో ఎవరికీ తెలీదు. మొన్నటి వరకు మంగళగిరిలో గట్టి నేతగా పేరున్న గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.
గంజి పార్టీ వదిలేయటం ఒకవిధంగా టీడీపీకి దెబ్బనే చెప్పాలి. నియోజకవర్గంలో మెజారిటీ సామాజికవర్గమైన చేనేతలకు చెందిన గంజికి తమ వర్గంలో గట్టిపట్టే ఉంది. అయితే గంజిలాంటి నేతలు వైసీపీలో ఇఫ్పటికే మురుగుడు హనుమంతరావు, కోండ్రు కమల కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తానే పోటీచేస్తానని చెప్పారు.
కాబట్టి ఇంతమందిని ఎదుర్కొని పోటీచేసి గెలవటం కష్టమని లోకేష్ లో ఏమైనా సెకండ్ థాట్ మొదలైందా ? అనే చర్చ కూడా పార్టీలో మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే లోకేష్ కు బెటర్ ఆప్సన్ భీమిలీనే అవుతుందనటంలో సందేహం లేదు. వైజాగ్ మొత్తంతో పాటు ప్రత్యేకంగా భీమిలీలో టీడీపీకి మంచిపట్టే ఉంది. లేదూ రెండు నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని అనుకున్నా కాస్త కష్టమే అయినా ప్రయత్నించటంలో తప్పూలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.