తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో కేసీఆర్ కుమార్తె - మాజీ ఎంపీ కవితకు ఒక స్థానం ఇస్తారని సర్వత్రా ప్రచారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి కవిత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో కవితను కేసీఆర్ ఎంపీగా చేస్తారని పార్టీ వర్గాలతో పాటు ప్రజలు కూడా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్యసభకు పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న కె.కేశవరావు - మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కవితకు అవకాశం రాలేదు.
అయితే కవిత రీ ఎంట్రీ గురించి కేసీఆర్ బాగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఆమెను ఈసారి రాష్ట్రంలో ఉండేలా భావిస్తున్నారంట. గతంలో నిజమాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి ఆమెను పరిమితం చేయాలని నిర్ణయించారంట. ఆమెకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారంట. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచే కవిత పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు. ఇది ప్రజలందరికీ ఆశ్చర్యపరిచింది. అది బీజేపీ చేతిలో ఓడిపోవడంతో టీఆర్ ఎస్ తో పాటు అందరూ ఖంగుతిన్నారు. ఆమె ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఆడపిల్లను ఒంటరిగా చేసి బీజేపీ - కాంగ్రెస్ కుట్రతో ఓడించారని కేసీఆర్ మనసులో నాటుకుపోయింది. దాంతోనే కవిత కలత చెంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
కవితను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకు వచ్చేలా టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంట. ఆమె ఓటమితో కేసీఆర్ కొంత భంగపడ్డారు. ఎప్పటి నుంచో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది.. అయితే అది వాస్తవమే. కాకపోతే ఇయాల కాకపోతే రేపు ఉంటుంది కానీ కేటీఆర్ మాత్రం పక్కా సీఎం అవుతారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కేటీఆర్ కు తోడుగా కవితను ఉండేలా కేసీఆర్ భావిస్తున్నారంట. అందుకే ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఆ రెండింట్లో ఒక స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కవితను మంత్రివర్గంలోకి తీసుకువచ్చి ఇతరులకు చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఇదే జరిగితే త్వరలోనే తండ్రి ముఖ్యమంత్రి - మంత్రులుగా కేటీఆర్ - కవిత ఉంటే ఆ మంత్రివర్గం ప్రత్యేకత సంతరించుకునే అవకాశం ఉంది.