గుజరాత్ ఘోరానికి అల్లరిమూకే కారణమా?

Update: 2022-10-31 04:25 GMT
అనూహ్య విషాదానికి వేదికగా మారింది గుజరాత్. అక్కడి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోవటంతో 140 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. నెలల తరబడి మరమ్మత్తులు చేపట్టి.. ప్రమాదం జరగటానికి కేవలం నాలుగు రోజుల ముందు నుంచే ఈ వంతెన మీదకు సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. అలాంటిది ఇంతటి ఘోరం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

ఈ వంతెన కూలటానికి కొత్త కోణాన్ని జాతీయ మీడియాకు చెందిన కొన్ని సంస్థలు వార్తల రూపంలో ప్రసారం చేస్తున్నారు. వంతెన కూలటానికి కొంతసేపు ముందు వంతెన మీద ఉన్న అల్లరిమూక విపరీతంగా వ్యవహరించటమే కారణమని చెబుతున్నారు.

వంతెనను విపరీతంగా ఊపటంతో పాటు.. దాని మీద ఎగిరెగిరి దూకారని.. వంతెనను కాళ్లతో తన్నినట్లుగా చెబుతున్నారు. ఆకతాయిలు ప్రవర్తనపై ఆందోళన వ్యక్తమవుతోంది. అల్లరిమూకల చేష్టల కారణంగానే వంతెన కూలి ఉంటుందని చెబుతున్నారు.

దర్యాప్తు అధికారుల వాదన ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో 500 మంది వరకు సందర్శకులు ఉన్నారని.. వీరంతా నదిలోకి పడిపోయినట్లుగా చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా.. కాపాడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. అల్లరి మూకల చేష్టల కారణంగానే వంతెన కూలి ఉంటుందా? అన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News