మోడీజీ ఏపీకి వస్తే.. ఈ మాట మరిచిపోతున్నారే!
ప్రధాని ఎక్కడైనా.. ఏ రాష్ట్రానికైనా.. ప్రధానే! దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకూ మోడీనే ప్రధాని. అయితే, ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు.. ముఖ్యంగా తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఉన్నరాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు చెబుతున్న మాటలు..తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మరిచిపోతున్నారు.
ముఖ్యంగా తన దత్తపుత్రుడు(కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో చెప్పారు) జగన్ సీఎంగా ఉన్న ఏపీలో పర్యటించినప్పుడు మాత్రం అస్సులు అలాంటి మాటలను మోడీ గుర్తుకూడా పెట్టుకోలేక పోతున్నారు.
ఇంతకీ మోడీ ఏమంటున్నారంటే.. షార్ట్‌కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని, షార్ట్‌కట్ పొలిటీషియన్లు పన్ను చెల్లింపుదారులకు శత్రువులని, వారు దేశ ఆర్థిక సంక్షేమం కన్నా తమ పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అంటున్నారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు, రాయితీలు, తాయిలాలను ప్రకటిస్తూ, వేగంగా అధికార పగ్గాలను చేపట్టాలని తహతహలాడేవారిని షార్ట్‌కట్ పొలిటీషియన్లుగా మోడీ చెబుతున్నారు
కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు ద్రోహం చేస్తున్నాయని కూడా మండిపడుతున్నారు. ప్రజల అదృష్టాన్ని నిర్దేశించే అవకాశం షార్ట్‌కట్ రాజకీయాలకు ఇవ్వకూడదని కూడా చెబుతున్నారు. ఓటు బ్యాంకు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసే పార్టీల బండారాన్ని బయటపెట్టాలన్నారు. షార్ట్‌కట్ పాలిటిక్స్, షార్ట్‌కట్ మార్గంలో వెళ్లే రాజకీయ నేతలు దేశానికి శత్రువులని కుండబద్దలు కొడుతున్నారు.
అయితే, ఇవన్నీ కూడా మోడీ.. ఏ తెలంగాణలోనో.. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనో చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లినా.. తనకు అనుకూలంగా ఉన్న సీఎంలు ఉన్న రాష్ట్రాలకు వెళ్లినా మోడీ ప్రస్తావించరు. మరీ ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాలకు వస్తే.. అసలు ఈ మాటే మరిచిపోతున్నారు.
ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. దేశంలోనే ఉచిత పథకాలు, నగదును నేరుగా ప్రజలకు భారీగా అందిస్తున్న రాష్ట్రం.. ఏపీనేనని .. ఇక్కడి సీఎం చెబుతున్నారు కాబట్టి. మరి మోడీ.. ఏపీలోనూ ఇలాంటి మాట చెప్పుకొచ్చు కదా.. అనేది నెటిజన్ల మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.