ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. కేంద్రంలో మోడీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో పెద్దలైన మోడీ అమిత్ షాలతో జగన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు. అలాగే మోడీ జగన్ ల బంధం తండ్రీకొడుల మాదిరిగా ఉంటుందని ఏకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ మధ్యన ఏపీ టూర్ లోనే చెప్పారు. అయితే అది ఇప్పటిదాకా అలాగే ఉందా. ఆ బంధం ఏమైనా బలహీనపడుతోందా అనడానికి లిట్మస్ టెస్ట్ గా విశాఖ మోడీ విశాఖ టూర్ ఉండబోతోంది అని అంటున్నారు.
ఇక ఏపీ బీజేపీతో జగన్ రిలేషన్స్ తీసుకుంటే ఆ పార్టీలో ఒక వర్గం అయితే పూర్తిగా జగన్ని పక్కన పెట్టాలని అంటోంది. రెండవ వర్గం మాత్రం జగన్ తో ఓకే అన్నట్లుగా పోతోంది. ఇపుడు ఏపీ బీజేపీని లీడ్ చేస్తున్న సోము వీర్రాజు కానీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కానీ వైసీపీ కంటే టీడీపీ మీదనే ఎక్కువగా విరుచుకుపడతారు అని విమర్శలు ఉన్నారు. ఇపుడు వారి నాయకత్వంలోనే మోడీ విశాఖ టూర్ ప్రోగ్రాం అంతా సాగుతోంది.
మరో వైపు బీజేపీ కంటే ముందే వైసీపీ విశాఖ మోడీ టూర్ లో చురుకుగుదనం ప్రదర్శిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి విసాఖలో విడిది చేసి మోడీ టూర్ అంతా ఫుల్ సక్సెస్ అయ్యేలా చూస్తున్నారు. ఒక విధంగా తమ పార్టీ ప్రధాని వస్తే ఎలా చేస్తారో అలాగే వైసిపీ మోడీ టూర్ కోసం కష్టపడుతోంది. ఇక మోడీ సభ కోసం లక్షలాది మంది జనాలను సమీకరణ చేయాలని కూడా వైసీపీ డిసైడ్ అయింది.
బీజేపీ తాము కూడా జనాలను తెస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఆ పని ఏదో వైసీపీయే చూస్తోంది కానీ నిబ్బరంగా ఉంటోందని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా వైసెపీఎ మీదనే ఆధారపడిపోయింది అనే చెబుతున్నారు. ఇక మోడీ టూర్ కి ఎవరెవరు రావాలి అన్న దాని మీద కూడా మొత్తం పెత్తనం వైసీపీయే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం, ఫక్తు అధికారిక కార్యక్రమం కాబట్టి ఎవరూ రాజకీయాలు చేయడానికి చూడవద్దు అని విజ్ఞప్తి రూపంలో చెప్పాల్సింది చెప్పేశారు అనుకోవాలి.
మరో వైపు చూస్తే టీడీపీ ఎటూ ఈ ప్రోగ్రాం కి రాకూడదు అని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే జనసేనని కూడా పిలిచే అవకాశం లేదు అనే అంటున్నారు. దానికి మీడియా ముందు సోము వీర్రాజుని దీని మీద అడిగితే ఆయన ఏమీ క్లారిటీగా చెప్పలేకపోయారు. అంటే విశాఖ మోడీ టూర్ లో కనిపించేది అంతా వైసీపీ, బీజేపీలో ఒక వర్గం నేతలు అని అంటున్నారు. ఇక బీజేపీలోని కొందరు కీలక నాయకులు అయితా ప్రధాని ఆఫీస్ తో మాట్లాడి తమ పేర్లను చివరి నిముషంలో యాడ్ చేయించుకుంటారని అంటున్నారు.
అలా వచ్చే వారు వస్తారు. కానీ వేదిక మీద మాత్రం మోడీ ఆయన పక్కన జగన్, బీజేపీ పెద్దగా సోము వీర్రాజు వంటి వారు మాత్రమే ఉండబోతున్నారు. సో ఇది పూర్తిగా వైసీపీ తాను అనుకున్నట్లుగా చేస్తున్న ప్రోగ్రాం అని అంటున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చివరి నిముషంలో కనుక టీడీపీ, జనసేనలకు ఇన్విటేషన్లు వచ్చినా వారు ఎటూ రారు అనే అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే కర్నూల్ ప్రోగ్రాం ఇవే తేదీలలో పెట్టుకున్నారని అంటున్నారు.
మొత్తంగా చూస్తే మోడీ టూర్ లో వచ్చే లాభాలను రాజకీయ మైలేజ్ ని తామే మొత్తం తీసుకోవాలని వైసీపీ చూస్తోంది. మోడీకి ఫుల్ సపోర్ట్ గా మూడున్నరేళ్ళ పాటు ఉన్నారు, ఏమీకి ఏమి సాధించుకుని వచ్చారు అని విపక్షాలతో పాటు జనాల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబుగా విశాఖలోని అభివృద్ధి పనులను చూపించాలని వైసీపీ అనుకుంటోంది.
అది జరగాలంటే విపక్షాలు ఏవీ ఈ టూర్ లో ఉండకూడదు అని ముందే డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. మరో వైపు విశాఖను పాలనారాజధానిగా వైసీపీ ఇప్పటికే చూస్తోంది. అలాంటి చోట ప్రధాని మోడీని రప్పించి తన నినాదానికి బలాన్ని మరింతగా పెంచుకోవడం అనే వ్యూహం కూడా దాగుంది అని అంటున్నారు. ఏ విధంగా చూసినా మోడీ టూర్ పూర్తిగా వైసీపీ అనుకున్నట్లే జరుగుతోంది అని అంటున్నారు. ఒక విధంగా విపక్షాలు మొత్తం ఈ టూర్ కి దూరం అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.