టీం ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ నిన్న ఉదయం కారు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న క్రమంలో పంత్ డ్రైవ్ చేస్తున్న మెర్సిడెస్ బెంజ్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుంచి మంటలు చెలరేగడంతో రిషత్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని బయటికి తీసి డెహ్రడూన్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో పంత్ నుదిటిపై చిట్లిన గాయాలయ్యాయి. వీపు పైన కాలిన గాయాలు.. కుడి కాలిపై లిగ్మెంట్ పక్కకు జరిగినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని అవసరమైన సహాయ సహకారాలు సైతం అందిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో అతడికి పెద్ద గాయాలు కాకపోవడానికి మెర్సిడెస్ బెంజ్ కారణమని తెలుస్తోంది.
పంత్ కు చెందిన మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ 43 4ఎంఏటీఐసీ కూపే కారును అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర 99 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ కూపే కారు అమ్మకాలు భారత్ లో నిలిపివేశారు. ఈ కారులో ఎయిర్ బాగ్స్.. 360 డిగ్రీల కెమెరా.. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
అలాగే మెర్సిడెస్ ఎల్ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్.. కో డ్రైవర్ ఫైర్ ఎక్స్ టింగ్విషర్.. అటెన్షన్ అసిస్ట్ అండ్ అసిస్ట్ సేఫ్టీ సిస్టమ్ వంటి సదుపాయాలున్నాయి. స్టీరింగ్ అసిస్ట్.. ప్రీ సేఫ్ బ్రేక్.. ఫ్రీ సేఫ్ ప్లస్.. యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ తో కూడిన క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్. యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్.. యాక్టివ్ బ్లైండ్ స్పాట్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలున్నాయి. ఈ కారు 5.7 సెకన్లలోనే 0-100 కి.మీ వేగం అందుకుంటుంది.
పంత్ ఈ కారులో పయనించడం వల్లే పెద్దగా గాయాలు కాకుండా బయట పడ్డాడనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పంత్ ఆరోగ్యంపై ఢిల్లీ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కారు ప్రమాదంలో పంత్ కు గాయాలు కావడంతో డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రిలో అతడికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారని ఆయన వెల్లడించారు.
కాగా జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన పంత్ ను కాపాడి ఆసుపత్రికి తరలించిన స్థానికులను త్వరలోనే సత్కరించనున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. రోడ్డు.. రవాణా.. హైవేస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘గుడ్ సమరితాన్’ పథకం కింద గౌరవిస్తామని ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట బాధితులకు కీలమని.. ఆ సమయంలో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే వారి ప్రాణాలను కాపాడొచ్చని తెలిపారు. మరోవైపు పంత్ ప్రమాద సంఘటన తెలుసుకున్న ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లో పరామర్శించారు. పంత్ త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేయగా బీసీసీఐ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.