పెద్ద నోట్లను రద్దు చేయటం.. కొత్త నోట్లను తీసుకురావటం లాంటి సంచలన నిర్ణయాలు తీసుకునే ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నారా? బడా బాబులకు భారీ షాక్ ఇవ్వనున్నారా? పెద్ద నోట్ల రద్దు వేళ ఠీవీగా ఎంట్రీ ఇచ్చిన రూ.2వేల నోటుపై ఆర్ బీఐ నిషేధం విధిస్తుందన్న మాట ఒకటి వైరల్ గా మారింది. ఇందులో నిజం ఎంత? అన్నది పెద్ద సందేహంగా మారింది.
ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న రూ.2వేల నోటుకు చెల్లుచీటి ఇచ్చేసి.. వెయ్యి రూపాయిల నోటును కొత్తగా తీసుకొస్తారన్న ప్రచారం తాజాగా జోరందుకుంది. ఈ వాదనకు సాక్ష్యంగా ఒక వైరల్ వీడియోను చూపిస్తున్నారు. దీంతో.. ప్రజల్లో సందేహాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా వ్యవహరించే వారి పుణ్యమా అని రూ.2వేల నోటు రద్దుపై ఎవరికి వారు చిత్రవిచిత్రమైన వాదనల్ని వినిపిస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రూ.2వేల నోటును మోడీ సర్కారు నిషేధం విధించనుందని.. ఈ పెద్ద నోటును రద్దు చేసిన తర్వాత.. రూ.2వేల నోట్లను మార్చుకోవటానికి ప్రజలకు కేవలం పది రోజుల టైం మాత్రమే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు.. రూ.2వేల నోట్లను కేవలం 25 మాత్రమే చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఎదుర్కొన్న నోట్ల ఇబ్బందిని మర్చిపోలేని ప్రజలు.. రూ.2వేల నోటు మీద జరుగుతున్న ప్రచారంతో మరింతగా బెదిరిపోతున్నారు. ఇదిలా ఉంటే.. రూ.2వేల నోట్లను ఒక క్రమ పద్దతిలో కేంద్రం తగ్గిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకిలా అంటే.. 2017లో మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్లు 50 శాతం వరకు ఉంటే.. ఏడాది వ్యవధిలో ఇవి కాస్తా 37 శాతానికి తగ్గిపోయాయి. అంతేకాడు.. ప్రింటింగ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. 2017లోఒ రూ.350.4 కోట్ల రూ.2వేల నోట్లు ఉంటే.. ఏడాది వ్యవధిలో రూ.1.51 కోట్లుగా తగ్గిపోయాయి. ఓ వైపు రూ.2వేల నోట్లు తగ్గుతున్న దానికి తగ్గట్లే రూ.500 నోట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రూ.500 నోట్ల చలామణీ 2017తో పోలిస్తే.. ఇప్పుడు 45 శాతం ఎక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది.
పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ కష్టాల్ని చూసిన ప్రజలు మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పెద్ద నోట్ల రద్దుకు తమ ఆమోదాన్ని తెలిపినా.. ప్రజలు పడే పాట్లను తగ్గించేలా మోడీ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శ ఉంది. రానున్న సార్వత్రికాన్ని దృష్టిలో ఉంచుకొని విపక్ష నేతలకు షాకిచ్చేలా మోడీ అండ్ కో రూ.2వేల నోటు విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ చర్చ అంతా వృధా అని.. ప్రజల్ని అయోమయానికి గురి చేయటానికి.. ఆందోళనలు పెంచేందుకే వైరల్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై క్లారిటీ కోసం ఆర్ బీఐ అధికారికంగా స్పందిస్తే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.